Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో తగ్గిన కోవిడ్ మరణాలు: కానీ పెరిగిన కేసులు

ఇండియాలో గత 24 గంటల్లో 2,76,110 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,57,72,440కి చేరుకొంది. కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 2,23,55,440 కి చేరుకొందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ డేటా తెలిపింది. 

India Records 2,76,110 New Infections, 3,874 Deaths In 24 Hours lns
Author
New Delhi, First Published May 20, 2021, 10:07 AM IST

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 2,76,110 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,57,72,440కి చేరుకొంది. కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 2,23,55,440 కి చేరుకొందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ డేటా తెలిపింది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు  9 వేలు పెరిగాయి. వరుసగా నాలుగో రోజు మూడు లక్షలలోపుగా కరోనా కేసులు రికార్డయ్యాయి.కరోనాతో గత 24 గంటల్లో దేశంలో 3,874 మంది మరణించారు.దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,87,122కి చేరుకొంది. దేశంలో 86.23 శాతంగా రికవరీ రేటు నమోదైంది. కరోనా పరీక్షను ఇంట్లో నిర్వహించేందుకు కేంద్రం బుధవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ విషయమై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా సోకిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్టు పొందినవారితో పాటు కుటుంబసభ్యులు ఇంట్లో పరీక్షను ఉపయోగించుకోవచ్చని ఐసీఎంఆర్ తెలిపింది.దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య కల్గించింది. అయితే అందుకు భిన్నంగా బుధవారం నాడు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4 వేల లోపుగా నమోదైంది. లాక్‌డౌన్  కారణంగా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టుగా ఆరోగ్యశాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios