న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు అభిప్రాయంతో ఉన్నారు. చాలా రోజుల తర్వాత  రెండు లక్షలకు దిగువన కరోనా కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో  1,96,427 మందికి కరోనా సోకింది. సోమవారం నాడు  20,85,112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,96, 427 మందికి కరోనా నిర్ధారణ అయింది.  దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,69,48,874కి చేరుకొంది. 

ఈ ఏడాది ఏప్రిల్ 14 తర్వాత ఇంత తక్కువస్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. కరోనాతో 3,511 మంది గత 24 గంటల్లో మరణించారు. కరోనాతో దేశంలో ఇప్పటివరకు 3,07,231 మంది చనిపోయారు.దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల రేటు 10.17 శాతానికి చేరుకొంది. సోమవారం నాడు ఒక్క రోజే 3,26,850 మంది వైరస్ బారి నుండి కోలుకొన్నారు. దేశంలో ఇప్పటికే కరోనా బారి నుండి 2.4 కోట్ల మంది కోలుకొన్నారు.గతంలో ఇండియాలో కరోనా కేసులు 4 లక్షలకు పైగా నమోదయ్యాయి. కరోనాతో 4 వేల మందికి పైగా మృత్యువాతపడేవారు.ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.