కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వున్న వ్యాపార అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలని పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా చైనా, హాంకాంగ్ వంటి విదేశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఫారెన్ పోర్టు ఫోలియోలపై ఫోకస్ పెట్టింది.

భారత్‌తో భూభాగంపై సరిహద్దులు పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలను పరిశీలించాలని నిర్ణయం వచ్చిన కొన్ని వారాలకే ఎఫ్‌సీఐలపై కూడా దృష్టి పెట్టడం గమనార్హం. అప్పట్లో భారత్ కంపెనీలను విదేశీ టేకోవర్ల నుంచి రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read:ఇండియాపై కన్నేసిన చైనా కంపెనీలు..ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు భారీ ప్లాన్.

ఈ నిర్ణయం వచ్చాకా చైనా పెట్టుబడిదారులు ఎఫ్‌సీఐల రూపంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టి కంపెనీ వాటాలతో పాటు నియంత్రణను దక్కించుకుంటారేమోనని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో చైనా నుంచి వచ్చే ఎఫ్‌సీఐల రిజిస్ట్రేషన్‌లను పరిశీలించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇవే నిబంధనలు హాంకాంగ్‌కు కూడా వర్తించే అవకాశాలు ఉన్నాయి.

Also Read:దేశీయ కంపెనీల్లో చైనా సంస్థల పెట్టుబడులపై ‘సెబీ’ నజర్..

ఎందుకంటే చైనా తక్కువ పెట్టుబడులను హాంకాంగ్ మార్గంలో విదేశాలకు చేరుస్తుంటుంది. తాజాగా ప్రతిపాదనలను కేంద్ర వాణిజ్య శాఖ, సెబీ సాయంతో తయారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ఆర్ధిక శాఖ వీటిని పరిశీలిస్తోంది. అయితే ఈ వార్తలపై ఆర్ధిక, వాణిజ్య శాఖలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.