భారతదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవానికి కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి ప్రపంచంలోని టాప్  టెన్ కరోనా ప్రభావిత దేశాల జాబితాలో ఏడవ స్థానానికి ఎగబాకిన భారత్, తాజాగా ఇటలీని తోసిరాజేస్తూ ఆరవ స్థానానికి చేరుకుంది. 

శుక్రవారం నాటికి భారతదేశంలో 2.35 లక్షలకు కరోనా కేసులు చేరుకోవడంతో... భారత్ ఇటలీని వెనక్కినెట్టి ఆరవ స్థానానికి చేరింది. రాష్ట్రాల డేటా ప్రకారంగా మరణాలు 6,600ను దాటేశాయి. వరం రోజులకిందనే కరోనా పుట్టిల్లు చైనాను దాటేసి 9వ స్థానంలో నిలిచిన భారత్, ఆ తరువాత కొన్ని రోజులకే 7వ స్థానికి చేరింది. ఇప్పుడు ఏకంగా ఆరవ స్థానానికి చేరుకుంది. 

లాక్ డౌన్ సడలింపులు మొదలైన దగ్గరి నుండి భారతదేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. నాలుగంకెల్లో కేసులు నమోదవుతున్న రాష్ట్రాల సంఖ్య మే 1వ తేదీ నుండి ఇప్పటికి రెట్టింపు అయ్యింది. 

ఇక శుక్రవారం నాటికి ఉన్న కేసుల సంఖ్య గనుక చూసుకుంటే... గత 24 గంటల్లో 9,851 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 273 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా 2,26,770కి కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు 6348 మంది మృతిచెందారు. కరోనా సోకిన రోగుల్లో 48.27 శాతం కోలుకొంటున్నట్టుగా  కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో నిన్న ఇండియా ఏడవస్థానంలో నిలిచింది.తొలుత అమెరికా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో బ్రెజిల్ ఉంది. మూడో స్థానంలో రష్యా నిలిచింది. ఆ తర్వాత యూకే, స్పెయిన్, ఇటలీలు నిలిచాయి. ఇప్పుడు ఇండియా ఇటలీని దాటేసి ఆరవ స్థానంలోకి వెళ్ళింది.  

కరోనాతో మరణించిన రోగుల సంఖ్యలో ఇండియా ప్రపంచంలో 12వ స్థానంలో నిలిచింది. కరోనా సోకిన రోగులు రికవరీ శాతంలో ప్రపంచంలో ఇండియా ఎనిమిదో స్థానంలో నిలిచింది.కరోనా కేసుల సంఖ్యలో రోజు రోజుకు ఇండియా ఎగబాకుతోంది. రేపటిలోపుగా ఇండియా ఇటలీని దాటే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మహారాష్ట్రలో గురువారం నాడు అద్యధికంగా 2,933 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 77,793కి చేరుకొన్నాయి కేసులు.ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2,710 మంది మరణించారు. 33,681 మంది రోగులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జీ అయ్యారు.

బెంగాల్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనాతో 283 మంది మరణించారు. రాష్ట్రంలో 6876 మందికి కరోనా సోకింది. తమిళనాడు రాష్ట్రంలో గురువారంనాడు ఒక్క రోజునే 1,384 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 27,256కి చేరుకొన్నాయి. ఇప్పటికి రాష్ట్రంలో 220 మంది చనిపోయారు.

షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ , హోటల్స్ తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను గురువారం నాడు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఈ నెల 8వ  తేదీ నుండి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది.

ఈ మార్గదర్శకాల మేరకు  గర్భవతుల వంటి వాళ్లు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించింది కేంద్రం.డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇవ్వాలని రెస్టారెంట్లు, హోటల్స్ మేనేమెంట్లను కేంద్రం కోరింది.