Asianet News TeluguAsianet News Telugu

వచ్చే నెలలో థర్డ్ వేవ్ ? ఎస్ బీఐ నివేదిక ఏం చెబుతోంది?..

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో వణికిపోతున్న భారత్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడతున్నాయి. అయినప్పటికీ మూడో ముప్పు తప్పదని ఇప్పటికే ఆరోగ్యరంగ నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపత్యంలో వచ్చే నెలలోనే (ఆగస్ట్) థర్డ్ వేవ్ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని ఎస్ బీఐ నివేదిక హెచ్చరించింది. సెప్టెంబర్ నెలలో ఇది గరిష్టానికి చేరుకోవచ్చని అంచనా వేసింది.

india may see start of third covid wave from next month : SBI report - bsb
Author
Hyderabad, First Published Jul 5, 2021, 5:00 PM IST

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో వణికిపోతున్న భారత్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడతున్నాయి. అయినప్పటికీ మూడో ముప్పు తప్పదని ఇప్పటికే ఆరోగ్యరంగ నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపత్యంలో వచ్చే నెలలోనే (ఆగస్ట్) థర్డ్ వేవ్ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని ఎస్ బీఐ నివేదిక హెచ్చరించింది. సెప్టెంబర్ నెలలో ఇది గరిష్టానికి చేరుకోవచ్చని అంచనా వేసింది.

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి, బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలమీద ప్రభావం వంటి అంశాలపై భారతీయ స్టేట్ బ్యాంక్ నిపుణుల బృందం ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా కోవిడ్ 19 : ది రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో తాజాగా పరిశోధనాత్మక నివేదికను విడుదల చేసింది. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రబావం ఎక్కువగానే ఉందని అభిప్రాయపడిన నివేదిక, మే 7వ తేదీన గరిస్టానికి చేరుకున్నట్లు తెలిపింది. 

ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే జులై రెండో వారానికి రోజువారీ కేసుల సంఖ్య 10వేలకు తగ్గుతుందని పేర్కొంది. అయినప్పటికీ ఆగస్టు రెండో పక్షం నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

ఎస్ బీఐ నివేదికలో మరిన్ని అంశాలు..

- థార్డ్ వేవ్ కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని ఎస్ బీఐ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ గరిష్ట కేసులతో పోలిస్తే థర్డ్ వేవ్ గరిష్ట స్థాయి కేసులు 1.7 రెట్లు ఎక్కువగా ఉండొచ్చు. 

- ఇప్పటివరకు నమోదవుతున్న గణాంకాల ప్రకారం, ఆగస్టు రెండో వారం తర్వాత కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అనంతరం నెల రోజుల వ్యవధిలోనే గరిష్టానికి చేరుకుంటుంది. 

-దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగానే కొనసాగుతోంది. నిత్యం సరాసరి 40 లక్సల డోసులను పంపిణీ చేస్తున్నారు. 

- ఇప్పటివరకు దేవ జనాభాలో 4.6 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. మరో 20.8శాతం మంది కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే, ఇది అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, స్పెయిన్. ఫ్రాన్స్ దేశాలతో పోలిస్తే కాస్త తక్కువేనని ఎస్ బీఐ నివేదిక అభిప్రాయపడింది. 

- ఇదిలా ఉంటే.. దేశంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 39వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా 723 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ లో కరోనామృతుల సంఖ్య 4 లక్షల 2వేలు దాటింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios