Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్: ఒక్క రోజులోనే వెయ్యి మంది మృతి

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సేకండ్ వేవ్ లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ కారణంగా  గత 24 గంటల్లో దేశంలో 1,027 మంది మరణించారు. 

India logs record spike with over 1.84 lakh cases, over 1,000 deaths lns
Author
New Delhi, First Published Apr 14, 2021, 10:24 AM IST

న్యూఢిల్లీ: దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సేకండ్ వేవ్ లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ కారణంగా  గత 24 గంటల్లో దేశంలో 1,027 మంది మరణించారు. దేశంలో ఒక్క రోజులోనే 1,84,,372 మందికి కరోనా సోకింది. మొత్తం 14,11,758 మందికి  నిన్న పరీక్షలు నిర్వహిస్తే 1.84 లక్షల మందికి కరోనా సోకినట్టుగా తేలింది. దేశంలో ఇప్పటికే 1.38 కోట్ల మందికి కరోనా సోకింది.  1,72,085 మంది కరోనాతో మరణించారు.


గత 24 గంటల్లో కరోనా క్రియాశీల కేసులు భారీగా పెరిగినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది. ప్రస్తుతం 13,65,704 మంది వైరస్ బారిన పడ్డారు. క్రియాశీల రేటు 9.24 శాతానికి చేరింది. కరోనా బారినపడిన 82,339 మంది  కోలుకొన్నారు.కరోనా కేసుల్లో బ్రెజిల్ ను ఇండియా దాటిపోయింది. కరోనా కేసుల రికవరీ రేటు 89.51 శాతానికి  చేరుకొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ రేటు 97 శాతంగా ఉండేది.దేశంలోనే మహారాష్ట్రలో కరోనా కేసులు  అత్యధికంగా నమోదౌతున్నాయి. ఒక్క రోజులోనే 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios