భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దాదాపు రోజుకో లక్ష కేసులు నమోదౌతున్నాయి. కాగా.. తాజాగా.. ఐసీఎంఆర్ అధికారులు చేసిన సర్వేలో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారు చేసిన సర్వే  ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో పబ్లిష్ చేశారు. కాగా.. వారు చెబుతున్న దాని ప్రకారం.. దేశంలో ఉన్న 0.73శాతం పెద్దలకు కరోనా రావడం ఖాయమని చెబుతున్నారు.

మే 11 నుండి జూన్ 4 వరకు నిర్వహించిన ఈ సర్వేలో 21 రాష్ట్రాల్లోని 28,000 మంది ప్రజల రక్త నమూనాలను పరీక్షించారు. కాగా.. ఎక్కువ శాతం 18 నుంచి 45ఏళ్ల వయసు ఉన్నవారికే కరోనా ఎక్కువగా సోకుతుందని చెప్పారు. దాదాపు 43.3శాతం కరోనా బాధితులు ఈ వయసు వారే ఉన్నారని తెలిపారు. వారి తర్వాత  46 నుండి 60 సంవత్సరాల మధ్య (39.5 శాతం); 60 ఏళ్లు పైబడిన వారిలో 17.2 శాతం మందికి కరోనా సోకుతున్నట్లు గుర్తించారు. 

వచ్చే ఏడాది  మే నాటికి దేశంలో 64,68,388 మందికి కరోనా సోకే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా పట్టణాల్లోనే ఈ కరోనా కేసులు నమోదౌతుండగా... త్వరలోనే ఈ కేసులు గ్రామాలకు కూడా పాకే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో త్వరగా గ్రామాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.కోవిడ్ కేసులు సున్నా లేదా తక్కువ సంఖ్యలో ఉన్న జిల్లాల్లో కూడా ప్రజలకు కరోనా సోకే ఉంటుందని వారు  చెబుతున్నారు. కరోనా పరీక్షలు ఎక్కువగా చేయకపోవడం వల్ల ఈ విషయం వెలుగులోకి రావడం లేదని చెబుతున్నారు.  కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తేనే.. కేసుల అసలు సంఖ్య తెలుస్తుందని వారు చెబుతున్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో (గ్రామాలు) సెరో-పాజిటివిటీ అత్యధికంగా 69.4 శాతంగా ఉండగా, పట్టణ మురికివాడల్లో ఇది 15.9 శాతంగా, పట్టణ మురికివాడల్లో ఇది 14.6 శాతంగా నమోదైంది.