Asianet News TeluguAsianet News Telugu

కాబూల్ నుంచి ఇండియా బయల్దేరిన చివరి కమర్షియల్ ఫ్లైట్

యుద్ధ వాతావరణం అలుముకున్న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి భారత చిట్టచివరి కమర్షియల్ ఫ్లైట్ వెనక్కి బయల్దేరింది. 129 మంది ప్రయాణికులతో వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఈ రోజు రాత్రికల్లా ఇండియా చేరనున్నట్టు సమాచారం. 

india last commercial flight returned from afghanistan
Author
New Delhi, First Published Aug 15, 2021, 7:40 PM IST

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్న తరుణంలో ఆ దేశరాజధాని కాబూల్ నుంచి భారత చిట్టచివరి కమర్షియల్ ఫ్లైట్ వెనక్కి బయల్దేరింది. సుమారు 129 మంది ప్రయాణికులతో ఈ ఫ్లైట్ రిటర్న్ అయినట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఎయిర్ఇండియా ఫ్లైట్ ఏఐ-244 ఈ రోజు రాత్రికల్లా భారత్ చేరుకుంటుందని తెలిపాయి.

ఈ రోజు ఉదయమే ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం కాబూల్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయింది. తాలిబన్లు కాబూల్‌ను నలువైపుల నుంచి దిగ్బంధించిన తరుణంలో అక్కడ ల్యాండింగ్‌పై కొంత గందరగోళం నెలకొంది. అందుకే ల్యాండింగ్‌లో కొంత జాప్యం చోటుచేసుకుంది. వారానికి మూడు సార్లు కాబూల్‌కు వెళ్లే ఈ ఫ్లైట్ భావిప్రణాళికలు అనిశ్చితిలో ఉన్నాయి. తాలిబన్లు పైచేయి సాధించడంతో ఆ దేశానికి విమాన సేవలపై అనుమానాలు అలుముకున్నాయి. ఇప్పటికే యూఏఈకి చెందిన ఫ్లైదుబాయి విమానాల సేవలు సోమవారం నుంచి రద్దయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios