భారత్ మళ్లీ కోవిడ్ కలకలం.. 5 మరణాలు, 335 కొత్త కేసులు.. యాక్టివ్ కేసులు ఎన్నంటే ?
దేశంలో మళ్లీ కోవిడ్ (Covid)కలకలం రేకెత్తిస్తోంది. చాపకింద నీరులా అది విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో 335 కరోనా కొత్త కేసులు (335 new corona cases) వెలుగులోకి వచ్చాయి. ఐదుగురు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,701 ( 1,701 active corona cases) కు చేరింది.
భారత్ లో మళ్లీ కోవిడ్ విజృంభణ మొదలుపెట్టింది. కేసుల సంఖ్య మెళ్లగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మన దేశంలో ఆదివారం కొత్తగా 335 కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701కు పెరిగింది. ఈ వైరస్ బారిన పడి 5 గురు మరణించారు. ఇందులో కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1ను గుర్తించిన కేరళలోనే నలుగురు, ఉత్తరప్రదేశ్ లో ఒకరు మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఇక పల్లె సంగ్రామం.. జనవరిలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు..
కాగా.. ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,04,816)గా ఉంది. అయితే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.46 కోట్లకు (4,44,69,799) పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ -19 కారణంగా ఇప్పటివరకు 5,33,316 మంది మరణించారు. కోవిడ్ సోకిన వారిలో మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 220.67 కోట్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇచ్చారు.
కేరళలో కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1
కేరళలో కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 ను అధికారులు గుర్తించారు. ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) సాధారణ నిఘా కార్యకలాపాలలో భాగంగా కేరళకు చెందిన 79 ఏళ్ల మహిళలో కోవిడ్ -19 సబ్ వేరియంట్ జెఎన్ .1 కేసును గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సీనియర్ అధికారి శనివారం ‘ఇండియా టుడే’తో తెలిపారు.
అమెరికా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లోని వాహనాన్ని ఢీకొట్టిన కారు..
తిరువనంతపురం జిల్లా కరకుళం నుంచి డిసెంబర్ 8న ఆర్టీపీసీఆర్ పాజిటివ్ శాంపిల్లో ఈ కేసును గుర్తించినట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ చెప్పారు. కాగా.. కొత్త వేరియంట్ గురించి కేరళ ఆరోగ్య మంత్రి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, సింగపూర్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేసిన భారతీయ ప్రయాణికులలో కొన్ని నెలల క్రితం ఈ సబ్ వేరియంట్ ను గుర్తించినట్టు తెలిపారు.
బీఆర్ఎస్ వైఫల్యం వల్లే ఏడు మండలాలను కోల్పోయాం - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కేరళ ఈ వేరియంట్ ను గుర్తించిందని చెప్పారు. దీనిపై ఎవరూ భయాందోళనకు గురి కాకూడని తెలిపారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ధీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని కోరారు.