భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తొలి వాణిజ్య ప్రయోగాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం అర్థరాత్రి 12:07 గంటలకు బాహుబలి రాకెట్ జీఎస్‌ఎల్వీ మార్క్ 3 (ఎల్వీఎం3)ను విజయవంతంగా ప్రయోగించింది. 

ఇస్రో రికార్డు:భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ లోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం అర్థరాత్రి 12:07 గంటలకు బాహుబలి రాకెట్ జీఎస్‌ఎల్వీ మార్క్ 3 (ఎల్వీఎం3)ను విజయవంతంగా ప్రయోగించింది.

అత్యంత శక్తివంతమైన బహుబలి రాకెట్ ద్వారా యూకే కు చెందిన 5200 కిలోలకు పైగా బరువున్న 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. ఇప్పటివరకు వాణిజ్యపరమైన ప్రయోగాలకు కేవలం పీఎస్ఎల్వీ రాకెట్లను మాత్రమే ఉపయోగించేవారు.. కానీ తొలిసారిగా జీఎస్‌ఎల్వీ మార్క్ 3 రాకెట్ ను వాణిజ్యపరమైన ప్రయోగాలను ఉపయోగించడం విశేషం. 

ఇస్రోకు చెందిన ఎల్‌విఎం3 రాకెట్ ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను మోసుకెళ్లిందని ఇస్రో చైర్మన్ సైంటిస్ట్ ఎస్ సోమనాథ్ తెలిపారు. దాదాపు 43.5 మీటర్ల పొడవైన రాకెట్‌ ప్రయోగం ఇదేనని ఇస్రో చైర్మన్‌ తెలిపారు. 8,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న అత్యంత బరువైన ఉపగ్రహాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. 36 వన్‌వెబ్ ఉపగ్రహాలతో కూడిన మరో సెట్‌ను వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎల్‌విఎం3 ప్రయోగించనున్నట్లు ఆయన తెలిపారు.

బాహుబలి రాకెట్ ఎందుకు పంపబడింది?

ఇది మూడు-దశల రాకెట్.. ఇందులో రెండు సాలిడ్ మోటారు స్టెప్పులు ఉంటాయి. లిక్విడ్ ప్రొపెల్లెంట్ కర్ స్టేజ్, మధ్యలో క్రయోజెనిక్ స్టేజ్ ఉంటాయి. ఈ భారీ రూపం కారణంగా.. దీనిని ఇస్రో యొక్క బాహుబలి అని కూడా పిలుస్తారు. LVM3-M2 మిషన్ ను ఇస్రో(ISRO) వాణిజ్య విభాగమైన NewSpace India Limited కోసం నిర్వహించిన మొదటి వాణిజ్య ప్రయోగం అయినందున.. ఈ ప్రయోగంతో ISROకి ప్రాముఖ్యత సంతరించుకుంది.

 న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, UK-ఆధారిత నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ (వన్‌వెబ్ లిమిటెడ్) మధ్య వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగం నిర్వహించబడుతోంది.స్పేస్ ఏజెన్సీ ప్రకారం.. వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలు ఈ మిషన్ ద్వారా నింగిలోకి ప్రయోగించబడ్డాయి. 5,796 కిలోల వరకు 'పేలోడ్'ని మోసుకెళ్లే మొదటి భారతీయ రాకెట్‌గా అవతరించింది. భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఇండియా వన్‌వెబ్‌లో ప్రధాన పెట్టుబడిదారు.

Scroll to load tweet…