అణు సామర్థం గల బాలిస్టిక్ మిస్సైల్ ‘అగ్ని ప్రైమ్’ను భారత్ శనివారం ఉదయం 9.45 నిమిషాలకు విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి జరిగింది. 

ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి కొత్త తరం అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ప్రైమ్’ను భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) వెల్లడించింది. ‘అగ్ని ప్రైమ్’ అనేది డ్యూయల్ స్టాండ్‌బై నావిగేషన్, గైడెన్స్ సిస్టమ్‌లతో కూడిన రెండు-దశల డబ్బీ సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ క్షిపణి అని పేర్కొంది. ఉదయం 9.45 గంటలకు క్షిపణిని ప్రయోగించారు.

గురుగ్రామ్ బాణాసంచా పేలుడు ఘటనలో మరో ముగ్గురు మృతి... ఆరుకి చేరిన మరణాలు

అణ్వాయుధ సామర్థ్యం గల వ్యూహాత్మక క్షిపణి అగ్ని ప్రైమ్‌కు పలు కొత్త ఫీచర్లు జోడించినట్లు ‘ఏఎన్ఐ’ నివేదించింది. దీని పరిధి 1,000 నుండి 2,000 కిలో మీటర్లుగా ఉంటుంది. అగ్ని-పి (ప్రైమ్) బాలిస్టిక్ క్షిపణి అగ్ని-III కంటే 50 శాతం తక్కువ బరువు కలిగి ఉంటుంది. అయితే దీనిని రైలు, రహదారిపై నుంచి కూడా ప్రయోగించవచ్చు. 

Scroll to load tweet…

‘‘ తూర్పు తీరంలో ఉన్న వివిధ టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ స్టేషన్లు, డౌన్‌రేంజ్ నౌకలు క్షిపణి ప్రయోగ మార్గం, పారామితులను పర్యవేక్షించాయి’’ అని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. మిషన్ లక్ష్యాలన్నింటిని అధిక స్థాయిలో ఖచ్చితత్వంతో నెరవేరుస్తూ క్షిపణి తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయవంతమైందని తెలిపింది. ఫ్లైట్-టెస్ట్ సిస్టమ్‌లో అనుసంధానించబడిన అన్ని అధునాతన సాంకేతికతల విశ్వసనీయ పనితీరును నిరూపించిందని డీఆర్డీవో పేర్కొంది.

Scroll to load tweet…

డీఆర్డీవోకు అభినందనలు తెలిపిన రాజ్‌నాథ్ సింగ్ 
అగ్ని-పి విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవో ను అభినందించారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా అగ్ని-పి పరీక్షను విజయవంతం చేసినందుకు శాస్త్రవేత్తలను అభినందించారు.