న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ క్లీన్ ట్రాన్స్ పోర్ట్ సహకారంతో ఇండియా క్లీన్ ట్రాన్స్ పోర్ట్ సమ్మిట్ ను నిర్వహించింది.
న్యూఢిల్లీ: ఇండియా క్లీన్ ట్రాన్స్ పోర్టు సమ్మిట్ ను సోమవారంనాడు న్యూఢిల్లీలో నిర్వహించారు. ది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్ పోర్టేషన్(ఐసీసీటీ) భాగస్వామ్యంతో జీ 20 సెక్రటేరియట్ ఈ సమ్మిట్ ను నిర్వహించింది. రవాణా పరిష్కారాలు, దేశం ఎదుర్కొంటున్న భవిష్యత్తు సవాళ్లను ఈ సమావేశంలో చర్చించారు.
ఇంపిరియల్ హోటల్ లో ఈ సమ్మిట్ ను ఏర్పాటు చేశారు. క్లీన్ ట్రాన్స్ పోర్టు సమ్మిట్ లో పాల్గొన్న ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), ఇంటర్నేషనల్ ట్రాన్స్ పోర్ట్ ఫోరమ్ (ఐటీఎఫ్), రాహ్ గిరి పౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
2070 నాటికి సున్నా ఉద్గారాల లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రజా రవాణ వ్యవస్థలను మరింత పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు.
ప్రపంచంలో అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెట్ ఇండియాలో ఉంది. ట్రాఫిక్ రద్దీ,వాయి కాలుష్యం వంటి సంక్లిష్ట సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇండియా క్లీన్ ట్రాన్స్ పోర్టేషన్ సమ్మిట్ ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించనుంది.
