పంజాబ్, కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆయుధాలు, మాదకద్రవ్యాలను సరఫరా చేయడానికి  పాకిస్థాన్ డ్రోన్లును ఉపయోగిస్తుందని భారత అధికారులు నివేదించారు. గత సంవత్సరం నవంబర్ వరకు దాదాపు 22 డ్రోన్‌లను భారత ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. సంవత్సరంలో 266 డ్రోన్ చొరబాట్లు నివేదించబడ్డాయి.

ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్తాన్ పై భారత్ విమర్శలు గుప్పించింది. భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులకు పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు గుండా ఆయుధాలను సరఫరా చేస్తోందని , ఈ చర్యను అంతర్జాతీయంగా ఖండించాలని భారత్ పిలుపునిచ్చింది. భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. "డ్రోన్‌లను ఉపయోగించి సరిహద్దు దాటి అక్రమ ఆయుధాల సరఫరా చేయడాన్ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఆ భూభాగాలపై నియంత్రణలో ఉన్న అధికారుల క్రియాశీల మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదని అన్నారు. అంతర్జాతీయ సమాజం అటువంటి ప్రవర్తనను ఖండించాలనీ, వారి దుశ్చర్యలకు రాష్ట్రాలను బాధ్యులను చేయాలని ఆమె అన్నారు. 

పంజాబ్, కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆయుధాలు, మాదకద్రవ్యాలను సరఫరా చేయడానికి పాకిస్తాన్ నుండి డ్రోన్లు వస్తున్నట్లు భారత అధికారులు నివేదించారు. గత ఏడాది నవంబర్ వరకు.. కనీసం 22 డ్రోన్‌లను భారత ఏజెన్సీలు అడ్డుకున్నట్లు నివేదించబడింది . సంవత్సరకాలంలో 266 డ్రోన్ చొరబాట్లు జరిగినట్టు నివేదించబడ్డాయి. జనవరిలో భారతదేశ సరిహద్దు భద్రతా దళం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో డ్రోన్ ద్వారా ఆయుధాలను సరఫరా చేసినట్టు గుర్తించారు. చట్టవిరుద్ధమైన ఆయుధాల ఎగుమతుల వల్ల అంతర్జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. 

ఉగ్ర కుట్రలపై కౌన్సిల్ సెషన్‌లో పాల్గొన్న కాంబోజ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ పేరు చెప్పనప్పటికీ, ఆ దేశానికి సంబంధించిన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు , వారికి ఆయుధాలు సరఫరా చేసే కొన్ని దేశాల మధ్య కుమ్మక్కు జరిగిందనీ, అలాంటి చర్యలకు పాల్పడిన ఆ దేశాలను కూడా హెచ్చరించాడు. మాస్క్‌డ్ ప్రొలిఫరేషన్ నెట్‌వర్క్‌లు , సున్నితమైన వస్తువులు, సాంకేతికతలకు సంబంధించిన మోసపూరిత సేకరణ పద్ధతుల దృష్ట్యా, అనుమానాస్పద విస్తరణ ఆధారాలతో కొన్ని రాష్ట్రాలు ఉగ్రవాదులు , ఇతర ప్రభుత్వేతర వ్యక్తులతో నిమగ్నమైనప్పుడు ఈ (ఉగ్రవాద) బెదిరింపుల పరిమాణం రెట్టింపు అవుతుందని ఆమె తెలిపారు. ఉగ్రవాద సంస్థలు సంపాదించిన చిన్న ఆయుధాల పరిమాణం , నాణ్యతలో పెరుగుదల, రాష్ట్రాల స్పాన్సర్‌షిప్ లేదా మద్దతు లేకుండా ఆయుధాలు, సైనిక పరికరాల ఎగుమతులు లేకుండా ఉండవని పదే పదే గుర్తుచేశారు. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు ఆజ్యం పోయడాన్ని విస్మరించలేమని అన్నారు. కౌన్సిల్ సమావేశాన్ని రష్యా అధ్యక్షత వహించింది. జనవరిలో భారతదేశ సరిహద్దు భద్రతా దళం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో డ్రోన్ ఆయుధాలను పడవేస్తున్నట్లు గుర్తించింది.