Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో కరోనా రికార్డ్.. తొలిసారి 50వేలు దాటిన కేసులు

తాజాగా దేశంలో తొలిసారిగా ఆదివారం 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,34,476 కు పెరిగింది.

india daily Covid19 cases cross 50,000for the first time
Author
Hyderabad, First Published Jul 27, 2020, 7:53 AM IST

భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా కేసులు దాదాపు 50వేలు నమోదౌతూ రాగా.. నిన్న మాత్రం 50వేల రికార్డును దాటేసింది.

 తాజాగా దేశంలో తొలిసారిగా ఆదివారం 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,34,476 కు పెరిగింది. కాగా ఈ అంటువ్యాధి నుండి కోలుకుంటున్న బాధితులు సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందనేది ఉపశమనం కలిగించే అంశంగా మారింది. 

దేశంలో కరోనా వైరస్ రిక‌వ‌రీ రేటు 63.9 శాతంగా ఉంది. ఆదివారం నాటికి మొత్తం 9,16,505 మంది బాధితులు ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఈ అంటువ్యాధి బారిన‌ప‌డి ఇప్పటివరకు 32,811 మందిని మృతిచెందారు. మహారాష్ట్రలో కొత్త‌గా 9,431 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 

మొత్తంగా చూసుకుంటే మ‌హారాష్ట్ర‌లో 3,75,799 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ వైరస్ మ‌హారాష్ట్ర‌లో మరో 267 మంది ప్రాణాలు తీసుకుందని, రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,656 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య‌శాఖ‌ తెలిపింది. ఇక ఢిల్లీలో గ‌త కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి.  ఆదివారం కూడా తక్కువ మొత్తంలో కరోనా కేసులు నమోదయ్యాయి.  కొత్తగా 1075 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios