భారతదేశంలో కరోనా కేసులు (Corona Cases) భారీగా తగ్గుతున్నాయి. రోజువారి కొత్త  కేసుల సంఖ్య లక్షకు తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 83,876 కరోనా కేసులు నమోదయ్యాయి. 

భారతదేశంలో కరోనా కేసులు (Corona Cases) భారీగా తగ్గుతున్నాయి. రోజువారి కొత్త కేసుల సంఖ్య లక్షకు తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 83,876 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే 22 శాతం తక్కువగా కొత్త కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిసి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,22,72,014కి చేరింది. తాజాగా కరోనాతో 895 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల (Corona Deaths) సంఖ్య 5,02,874కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,99,054 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,06,60,202కి చేరింది. తాజాగా అత్యధికంగా కేరళలో 26,729, మహారాష్ట్రలో 9,666, కర్ణాటకలో 8,425, తమిళనాడులో 6,120, మధ్యప్రదేశ్‌లో 5,171 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు 9.18 శాతంగా వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 96.19 శాతం, యాక్టివ్ కేసలు 2.62 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. భారత్‌లో నిన్న 14,70,053 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు దేశంలో పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,69,63,80,755 కి చేరింది. 

నెల రోజుల తర్వాత లక్షకు తక్కువగా..
జనవరి 6 తర్వాత దేశంలో కరోనా కేసులు లక్షకు తక్కువగా నమోదు అవ్వడం ఇదే తొలిసారి. అంటే దాదాపు నెల రోజుల తర్వాత రోజువారి కరోనా కేసులు లక్షకు తక్కువగా నమోదయ్యాయి.