న్యూఢిల్లీ:  అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభించడంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ చేసిన విమర్శలపై భారత్ కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ కు ఇండియా ధీటుగా సమాధానం చెప్పింది.

బాబ్రీ మ‌సీదు స్థ‌లంలో రామాల‌యం నిర్మిస్తున్నార‌ని విమర్శ‌ల‌కు దిగింది. ముస్లింల‌పై భార‌త్ వివ‌క్ష చూపుతుంద‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మంటూ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసింది.  హిందూత్వ ఎజెండాను ముందుకు తెచ్చేందుకు ఈ ఆలయ నిర్మాణాన్ని కరోనా సమయంలో ప్రారంభించిందని ఆరోపణలు చేసింది.

భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ పాకిస్తాన్ తీరును ఓ ప్రకటనలో ఎండగట్టారు. భారతదేశంలో అన్ని మత విశ్వాసాలకు సమాన హక్కులను కల్పిస్తోందన్నారు. దేశంలో చట్ట నియమాల ద్వారా అందరికి అన్ని హక్కులకు సమానంగా కల్పించబడుతాయన్నాను. 

పాకిస్తాన్ లో మైనారిటీలకు కల్పిస్తున్న హక్కుల గురించి ఆ దేశం సిగ్గుపడాలన్నారు.  అయోధ్యలో బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణాన్ని చేపట్టడాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రజలు ఖండిస్తున్నారని పాకిస్తాన్ విదేశాంగ ప్రకటించింది.

2019లో సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సమ్మతి తెలిపింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఈ నెల 26వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే.