Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలో నాలుగో స్థానానికి ఎగబాకిన ఇండియా: మొత్తం 3,66,946కి చేరిన కరోనా కేసులు

గత 24 గంటల్లో ఇండియాలో 12,881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,66,946కి చేరుకొన్నాయి.కరోనాతో  దేశంలో ఇప్పటికే  12,237 మంది మృత్యువాత పడ్డారు.

India Coronavirus, COVID-19 Live Updates, June 18: India's COVID-19 cases rise to 366946 with 12237 fatalities, recovery rate at 52.95%
Author
New Delhi, First Published Jun 18, 2020, 10:44 AM IST


న్యూఢిల్లీ: గత 24 గంటల్లో ఇండియాలో 12,881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,66,946కి చేరుకొన్నాయి.కరోనాతో  దేశంలో ఇప్పటికే  12,237 మంది మృత్యువాత పడ్డారు.

కరోనా సోకిన 1,94,325 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఇంటికి చేరుకొన్నారు. కరోనా సోకిన రోగులు కోలుకొంటున్న సంఖ్య 52.95కి చేరుకొన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాల్లో కరోనాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మరోసారి దేశంలో లాక్ డౌన్ విధించే పరిస్థితి లేదని ఆయన ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

కరోనా కేసుల్లో ప్రపంచంలోని నాలుగో స్థానానికి ఇండియా ఎగబాకింది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత ఇండియా నిలిచింది.

ఇప్పటివరకు నమోదైన కేసుల కంటే అత్యధికంగా ఇండియాలో కేసులు నమోదయ్యాయి. 12,881 కేసులు 24 గంటల వ్యవధిలో నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు ప్రకటించింది. ఒక్క రోజు వ్యవధిలోనే 334 మంది మృత్యువాత పడ్డారు.

మిజోరాంలో 9 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 130కి కరోనా కేసులు చేరుకొన్నాయి. కరోనా సోకిన వారిలో ఒక్కరు కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

బుధవారం నాడు ఒక్కరోజులోనే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 11 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 506కి చేరుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు 12 వేలను దాటాయి.బీహార్ రాష్ట్రంలో కరోనా కేసులు 6940కి చేరుకొన్నాయి. 130 మందికి కరోనా సోకినట్టుగా  వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనాతో రాష్ట్రంలో 39 మంది మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios