Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్: భారత్ లో కొత్తగా 38 మంది మృతి, మొత్తం కేసులు 11,400

భారతదేశంలో కొత్తగా గత 24 గంటల్లో 38 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 11,400కు పైగా చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.
India coronavirus cases reach 11,439, deaths 377
Author
New Delhi, First Published Apr 15, 2020, 9:35 AM IST
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 11,439 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 377కు చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 38 మరణించారు. తాజాగా మరో 1,076 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 

మహారాష్ట్రలో అత్యధికంగా 2,337 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానం ఢిల్లీ ఆక్రమించింది. ఢిల్లీలో 1,510 కేసులు రికార్డయ్యాయి. తమిళనాడు 1,173 కేసులతో మూడో స్థానంలో నిలిచించింది. 

గుజరాత్ లో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఆయన మంగళవారంనాడు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఇద్దరు మంత్రులతో ఏర్పాటైన సమావేశానికి హాజరయ్యారు. ఆ ఎమ్మెల్యే హాజరైన ప్రెస్ కాన్ఫెరన్స్ కు కాంగ్రెసు ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా కూడా హాజరయ్యారు. 

ముంబైలోని బాంద్రాలో వలస కూలీల సమస్య ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ పొడగింపుతో వలస కూలీలు ఒక్కసారిగా రోడ్ల మీదికి వచ్చారు. బాంద్రాలోని రైల్వే స్టేషన్ వద్ద వలస కూలీలు కూడారు. దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. మంగళవారం ఒక్క రోజే కొత్తగా 52 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 642కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 110 మంది కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మంగళవారం కరోనా వైరస్ తో ఒక్కరు మరణించారు. దీంతో తెలంగాణలో మరణాల సంఖ్య 18కి చేరుకుంది. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో అత్యధికంగా 249 కేసులు నమోదయ్యాయి.
Follow Us:
Download App:
  • android
  • ios