నిజాముద్దీన్ మర్కజ్ కరోనా పాపం ఎంతంటే: కేంద్ర ఆరోగ్య శాఖ
నిజాముద్దీన్ మర్కజ్ కారణంగా 23 రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శఆఖ తెలిపింది. యుపిలో, ఢిల్లీలో, అస్సాంలో నిజాముద్దీన్ మర్కజ్ కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్: భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 991 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 43 కరోనా మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు 14,378 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో 11,906 యాక్టివ్ కేసులు. శనివారం రికవరీ అత్యధికంగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 43 మరణాలు సంభవించాయి.
మహారాష్ట్రలో అత్యధికంగా 3,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా గత 24 గంటల్లో 286 కేసులు రికార్డయ్యాయి. వీటిలో 177 కేసులు ఢిల్లీలోనే నమోదైనట్లు ఆరోగ్య శాఖ జాయింట్ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్త 7గురు మరణించినట్లు తెలిపారు. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 194కు చేరుకుంది.
ఉత్తరాఖండ్ లో లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు 7,220 మందిని అరెస్టు చేశఆరు. మొత్తం 1,758 కేసులు నమోదు చేశారు. గత 14 రోజులుగా దేశంలోని 45 జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదు. దేశీయ విమానాల బుకింగ్స్ మే 4వ తేదీ నుంచి, విదేశీ విమాన ప్రయాణాల బుకింగ్స్ జూన్ 1వ తేదీనుంచి ప్రారంభమవుతాయి.
దేశంలోని మొత్తం 14,378 కేసుల్లో 4,291 కేసులు నిజాముద్దీన్ మర్కజ్ కు సంబంధించినవేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అస్సాంలో 91 శాతం కేసులు నిజాముద్దీన్ మర్కజ్ కు సంబంధించినవేనని చెప్పింది. నిజాముద్దీన్ మర్కజ్ నుంచి 23 రాష్ట్రాలకు కరోనా వైరస్ విస్తరించింది. అది 29.8 శాతం ఉంది.
ఢిల్లీలో 63 శాతం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 59 శాతం కేసులు నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనలనుంచి వచ్చినవారి వల్లనే నమోదయ్యాయి. బీహార్ లో నిజాముద్దీన్ మర్కజ్ కేసులు ఏవీ రికార్డు కాలేదు.