దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ కట్టడికి విధించిన ఆంక్షల ఫలితం కనిపిస్తుంది. రోజువారి కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. కొత్త కేసులు తొలిసారి 45 రోజుల కనిష్టానికి చేరాయి. వరుసగా మూడో రోజూ మరణాలు 4000 దిగువలే నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా శుక్రవారం 20,80,048మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,73,790 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మొదటిసారి 45 రోజుల తర్వాత కొత్త కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. అలాగే 24 గంటల వ్యవధిలో 3,617 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2.77 కోట్లకు పైబడగా.. కరోనా కాటుకి 3,22,512 మంది బలయ్యారు.

బెంగళూరు రాక్షస లైంగిక దాడి: నిందితుల్లో హైదరాబాదీ, మరిన్ని విస్తుపోయే విషయాలు...

వైరస్ ఉద్ధృతి అదుపులోకి రావడంతో క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 22,28,724 మంది కోవిడ్ తో బాధపడుతుండగా, క్రియాశీల రేటు 8.50 శాతానికి చేరింది. రికవరీ రేటు 90. 34 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 2.5 కోట్ల మందికి పైగా వైరస్ ను జయించారు.  నిన్న ఒక్కరోజే 2,84,601మంది ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

వరుసగా 16వ రోజు కొత్త కేసుల కంటే రికవరీ లే ఎక్కువగా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా నివారణ టీకాల కార్యక్రమం కింద ఇప్పటి వరకు 20,89,02,445 డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 30,62,747 డోసులు పంపిణీ చేశారు.