Asianet News TeluguAsianet News Telugu

కరోనా పీడిత టాప్ 10 దేశాల్లో 9వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకిన భారత్!

ఇప్పటికే అత్యధిక కేసులు నమోదవుతుండడంతో ప్రపంచంలో కరోనా వైరస్ బారినపడ్డ టాప్ 10 దేశాల్లో భారత్ కూడా చేరిపోయింది. తాజాగా 1,88,000 పైచిలుకు కేసులతో టాప్ 10 లో 9వ స్థానంలో ఉన్న భారత్ ఫ్రెండు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది. 

India Climbs To 7th Spot From 9th Amongst 10 Worst-Hit Nations By COVID-19
Author
New Delhi, First Published Jun 1, 2020, 8:27 AM IST

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. లాక్ డౌన్ ను కూడా సడలించడంతో కేసుల సంఖ్యా అంతకంతకు పెరుగుతూ ఏ రోజుకారోజు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 

ఇప్పటికే అత్యధిక కేసులు నమోదవుతుండడంతో ప్రపంచంలో కరోనా వైరస్ బారినపడ్డ టాప్ 10 దేశాల్లో భారత్ కూడా చేరిపోయింది. తాజాగా 1,88,000 పైచిలుకు కేసులతో టాప్ 10 లో 9వ స్థానంలో ఉన్న భారత్ ఫ్రెండు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది. 

18 లక్షల పైచిలుకు కేసులతో అమెరికా అగ్ర స్థానములో ఉండగా, ఆతరువాత 5 లక్షల పైచిలుకు కేసులతో బ్రెజిల్, నాలుగు లక్షల కేసులతో రష్యా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 

మొన్నొక్కరోజే 8,000 పైచిలుకు కేసులు నమోదయ్యాయని నిన్న ప్రభుత్వం ప్రకటించింది. మరణాల సంఖ్యా కూడా 5,000ను దాటడం ఇక్కడ కలవరపెడుతున్న విషయం. భారత్ లో లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేస్తున్న తరుణంలో ఇప్పుడు కరోనా వైరస్ కేసులు మరింతగా పెరుగుతుండడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. మరి ముఖ్యంగా గడిచిన మూడు రోజులుగా భారత్ లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 

ఇకపోతే... కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరిన్ని సడలింపులతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసింది  కేంద్ర ప్రభుత్వం. 

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరిన్ని సడలింపులతో జూన్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించింది. దేశవ్యాప్తంగా జూన్ 8 నుండి దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు, హోటల్లు, రెస్టారెంట్, మాల్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతించారు.  అలాగే రాష్ట్రాల అనుమతితో అంతర్రాష్ట్ర ప్రజారవాణా, సరుకు రవాణా చేసుకోవచ్చని  తెలిపింది. 

ఇక విద్యాసంస్థలపై నిర్ణయాన్ని కూడా కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. పరిస్థితులను బట్టి జూలై నుండి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవచ్చని తెలిపింది. అయితే  విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత విద్యాసంస్థలదేనని... అందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలకు సూచించారు. 

కంటైన్మెంట్ జోన్లలో పూర్తి  స్ధాయి  లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత అధికంగా వున్న ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాత్రివేళల్లో  కర్ఫ్యూను కూడా సడలించారు. ఇప్పటిలా 7 గంటల నుండి కాకుండా రాత్రి  9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు.

 
ఇక జూన్ 8 తర్వాత  సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు, పార్కులు, బార్లు, మెట్రో రైల్లు, జిమ్ లు, ఆడిటోరియంలను తెరించేందుకు అనుమతినివ్వలేదు.  సభలు,సమావేశాలు మరీ ముఖ్యంగా రాజకీయ, మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేదం కొనసాగనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేదం కొనసాగనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios