న్యూఢిల్లీ:భారత్-చైనా సరిహద్దుల్లో ఈ నెల 15వ తేదీన జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన ఘటనపై అఖిలపక్ష సమావేశంలో పార్టీలకు పరిస్థితిని కేంద్రం వివరించనుంది.

శుక్రవారం నాడు సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ద్వారా పలు పార్టీల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

20 పార్టీలకు కేంద్ర ప్రభుత్వం  ఆహ్వానం పంపింది. సరిహద్దులో చైనా, ఇండియా ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్ని పార్టీలకు వివరించనున్నారు.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు పార్లమెంట్ లో ఐదు కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు పార్టీలతో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు, కేంద్ర మంత్రివర్గంలో భాగస్వామ్య పార్టీలకు ఆహ్వానం పంపారు.

also read:గాల్వాన్‌ ఘర్షణ: చైనా చేతికి చిక్కిన 10 మంది భారత జవాన్లు విడుదల

ఆప్, ఆర్జీడీకి మాత్రం ఆహ్వానం అందలేదు. తెలుగు రాష్ట్రాల నుండి టీఆర్ఎస్, వైసీపీకి చెందిన ప్రతినిధులు కూడ ఈ సమావేశంలో పాల్గొంటారు.
చైనా విషయంలో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై ప్రభుత్వం ఆయా పార్టీలతో చర్చించనుంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలు పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.