చైనాలో కరోనా ఉధృతి.. ఇండియాలో ఆందోళన.. కరోనా వేరియంట్లను ట్రాక్ చేయండి: రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
చైనాలో కరోనా కేసులు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. స్మశానాలు శవాలతో నిండిపోయాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని చెప్పింది. ఎప్పటికప్పుడు పాజిటివ్ కేసుల శాంపిళ్లు ల్యాబ్‌లకు పంపించాలని తెలిపింది.

న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎధుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి ప్రిపేర్ చేస్తున్నది. పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని సూచించింది. తద్వార కరోనా వేరియంట్లను ట్రాక్ చేయాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది.
జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్, చైనాల్లో కరోనా కేసులు ఆకస్మికంగా అనూహ్యంగా పెరిగిపోతున్నాయని, కాబట్టి, ఇన్సాకాగ్ నెట్‌వర్క్ ద్వారా పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ సంఖ్యను పెంచాలని, తద్వార కరోనా వైరస్ వేరియంట్లను ట్రాక్ చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
తద్వార దేశంలో ఏవైనా కొత్త వేరియంట్లు ప్రవేశించి ఉంటే సకాలంలో గుర్తించడానికి వీలు కలుగుతుందని సూచించారు. తద్వార అనుగుణమైన ప్రజా ఆరోగ్య చర్యలు తీసుకోవడానికి సాధ్యమవుతుందని వివరించారు. అన్ని పాజిటివ్ కేసుల శాంపిళ్లను ఏరోజుకు ఆ రోజే ఇన్సాకాగ్ (INSACOG) జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పంపించాలని తెలిపారు.
Also Read: చైనాలో కొవిడ్ కేసులు ఉధృతం.. నిమ్మకాయలకు ఒక్క ఉదుటున పెరిగిన డిమాండ్
ప్రపంచవ్యాప్తంగా ప్రతి వారం సుమారు 35 లక్షల కరోనా కేసులు రిపోర్ట్ అవుతున్నాయని కేంద్రం తెలిపింది. భారత్‌లో 24 గంటల్లో 112 కొత్త కేసులు రిపోర్ట్ అయినట్టు ఈ రోజు ఉదయం కేంద్రం వివరించింది. అయితే, యాక్టివ్ కేసులు 3,490కు పడిపోయాయని తెలిపింది.
చైనాలో స్మశాన వాటికలు శవాలతో నిండిపోయాయి. కరోనా వేవ్‌లు వీరవిహారం చేస్తుంటే మరణిస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. కరోనా కొత్త కేసులను లెక్కించడమే అసాధ్యంగా మారిందని అధికారులు చెబుతుండటం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నది.
Also Read: మహిళ రేప్ చేసినట్టు మైనర్ బాలిక ఫిర్యాదు.. ఖంగుతిన్న పోలీసులు.. అసలేం జరిగిందంటే?
ఏళ్ల పాటు అమలు చేసిన లాక్‌డౌన్, క్వారంటైన్లు, మాస్ టెస్టింగ్‌లను చైనా ప్రభుత్వం ఒక్కసారిగా లిఫ్ట్ చేస్తూ నిర్ణక్ష్ం తీసుకుంది. దీంతో గేట్లు ఎత్తేసినట్టుగానే కరోనా కేసుల ప్రవాహం వచ్చింది. చైనాలో కరోనా కేసుల విజృంభణ మిగతా ప్రపంచానికంతటికి ప్రమాదకరమే అని అమెరికా తాజాగా హెచ్చరించింది. వైరస్ ఉత్పరివర్తనాలకు ఊతం ఇవ్వొచ్చని, అలాగే, పెద్ద ఆర్థిక వ్యవస్థ కావడంతో సహజంగానే ఇతర దేశాలపై దాని ప్రభావం స్పష్టంగా పడుతుంది.