భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత వేగంగా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టింది. ఆకలి కేకల నుంచి ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను అందించగలిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్‌లలో అభివృద్ధితోపాటు మిలిటరీ అవసరాలను స్వయంగా తీర్చుకునే స్థాయికి మన దేశం ఎదిగింది. 

న్యూఢిల్లీ: భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వాతంత్ర్యం పొందిన తర్వాతే వడిగా ముందుకు వెళ్లగలిగింది. సున్నాను ప్రపంచానికి అందించిన ఆర్యభట్ట, సైన్స్ మ్యాస్ట్రో సివి రామన్ వంటి మేధావులు పుట్టిన మన దేశం ఇప్పుడు శాస్త్రపరిశోధనల్లో వేళ్ల మీద లెక్కించగలిగే దేశాల సరసన ఉన్నది. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్‌లలో అభివృద్ధితోపాటు మిలిటరీ అవసరాలను స్వయంగా పరికరాలను తయార చేసుకుకునే దశకు మన దేశం ఎగబాకింది.

స్వాతంత్ర్యం పొందిన వెంటనే మన దేశంలో పంచ వర్ష ప్రణాళిక విధనాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ ప్రణాళికల్లో వ్యవసాయం, సైన్స్, మౌలిక వసతులు, విద్యా రంగాలకు తొలుత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్లాన్డ్‌ డెసిషన్స్ కారణంగా భారత్ ఒకప్పుడు ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం నుంచి ఎగుమతి చేసే దేశంగా.. ఆహార సంపన్న దేశంగా ఎదిగింది. ఈ సైన్స్ టెక్నాలజీతో భారత్‌లో హరిత విప్లవం వచ్చింది. ఈ హరిత విప్లవం భారత్‌ను స్వయం సమృద్ధ దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టింది.

ఆర్యభట్ట.. తొలి శాటిలైట్
భారత్ అంతరిక్ష రంగంలో విశేష స్థానానికి నేడు చేరుకుంది. భారత్ తొలిసారి 1969న సొంత ఉపగ్రహం ఆర్యభట్టను అంతరిక్షంలో పంపించింది. దీని డిజైన్, తయారీ వంటి వన్నీ సొంతంగా ఏర్పరుచుకున్నవే. 1975 ఏప్రిల్ 19న ఈ ఉగప్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. 

అగ్ని క్షిపణి:
భారత ప్రభుత్వం 1980లలో విజయవంతంగా అగ్ని మిసైల్‌ను తయారు చేసింది. 1989లో ఈ అగ్ని పూర్తయింది.

డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్: 
1988లో భారత్‌లో ఫింగర్ ప్రింటింగ్ అందుబాటులోకి వచ్చింది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ దీన్ని డెవలప్ చేశారు. ఈ టెక్నిక్ ఉన్న మూడో దేశంగా భారత్ నిలిచింది. 

పోఖ్రాన్-11 న్యూక్లియర్ టెస్టు: 
1998 మే 11వ తేదీన భారత్ విజయవంతంగా ఐదు న్యూక్లియర్ బాంబులను టెస్టు చేసింది. రాజస్తాన్ పోఖ్రాన్‌లో అండర్‌గ్రౌండ్‌లో ఈ పరీక్ష జరిగింది. తద్వార భారత్ కూడా న్యూక్లియర్ స్టేట్‌గా అవతరించింది. ఈ రోజునే నేషనల్ టెక్నాలజీ డేగా సెలెబ్రేట్ చేస్తారు. 

చంద్రయాన్: 
చంద్రుడి మీదకు 2008 అక్టోబర్ 22న భారత్ తొలిసారిగా చంద్రయాన్-1ను ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరి కోట నుంచి ఈ మిషన్ ప్రయోగించింది. చంద్రుడికి సంబంధించిన పలు అంశాలను ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఇస్రోకు పంపింది.

పోలియో ఫ్రీ: 
1994లో ప్రపంచంలో 60 శాతం పోలియో వ్యాధిగ్రస్తులు మన దేశంలోనే ఉండేవారు. కానీ, పోలియో ఫ్రీ క్యాంపెయిన్ కారణంగా రెండు దశాబ్దాల కాలంలోనే పోలియో ఫ్రీగా భారత్ మారింది.

మంగళ్యాన్:
భారత్ తొలిసారి వేరే గ్రహం మీదికి 2013 నవంబర్ 5న మామ్‌ను ప్రయోగించింది. తక్కువ ఖర్చుతో భారత్ వేరే గ్రహం పైకి దీన్ని పంపి చరిత్ర సృష్టించింది.

కరోనా వ్యాక్సిన్:
భారత్ అతిపెద్ద టీకా తయారీదారుగా ఉన్నది. కరోనా టీకాలనూ భారత్ స్వయంగా అభివృద్ధి చేసుకోగలిగింది. కరోనా టీకాలను కూడా భారత్ పెద్ద మొత్తంలో ఎగుమతి చేసింది. 2021 చివరి కల్లా మన దేశంలో కనీసం 90 దేశాలకు 7 కోట్ల వరకు టీకాలను పంపింది.