Asianet News TeluguAsianet News Telugu

INDEPENDENCE DAY 2022 : స్వాతంత్య్ర వేడుకల వేళ పంజాబ్ లో ఉగ్ర కుట్రలు.. భగ్నం చేసిన పోలీసులు..4 అరెస్ట్..

స్వాతంత్ర్య దినోత్సవ వేళ భారీ ఉగ్రకుట్రను పంజాబ్ పోలీసుల భగ్నం చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 
 

INDEPENDENCE DAY 2022 : pak backed terror attackes busted in punjab, 4 held
Author
Hyderabad, First Published Aug 15, 2022, 6:47 AM IST

చండీగఢ్ :  స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ  పంజాబ్ లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ మద్దతుదారుల కుట్రలను భగ్నం చేసిన పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 హ్యాండ్ గ్రనేడ్లు, ఒక ఐఈడి,  రెండు పిస్టళ్లు, 40  క్యాట్ట్రిడ్జులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ను  పంజాబ్-ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. ‘స్వాతంత్ర దినోత్సవ వేడకల వేళ పంజాబ్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాం. పాకిస్థాన్కు చెందిన  ఐఎస్ఐ మద్దతు కలిగిన నలుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నాం. కెనడాకు చెందిన అర్ష్ డల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్ తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశాం’ అని అని పంజాబ్ పోలీస్ ట్విట్టర్లో వెల్లడించారు. ఆ ముఠా నుంచి 3 హ్యాండ్ గ్రనేడ్లు (పి-86), ఐఈడీ,  రెండు 9ఎం.ఎం. పిస్టళ్లు, 40 క్యాట్రిడ్జ్ లు సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ పంజాబ్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

Independence Day 2022: స్వాతంత్య్ర వేడుకలకు సిద్ద‌మైన‌ భార‌తం.. వరుసగా 9వ సారి ఎర్రకోటపై ప్ర‌ధాని జెండా వందనం

ఇదిలా ఉండగా, గత నవంబర్ లోనూ పంజాబ్ లో పోలీసులు ఇలాంటి మరో ఉగ్రకుట్ర భగ్నం చేశారు. దేశంలో బాంబ్తో పేలుడుకు పాల్పడాలన్న ఉగ్రకుట్రను తిప్పికొట్టారు. ఇండియా - పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో పంజాబ్ లోని వ్యవసాయ క్షేత్రంలో దాచిన టిఫిన్ బాంబును స్వాధీనం చేసుకుని మరో టెర్రరిస్టుల దాడిని అడ్డుకోగలిగారు. ఈ విషయాన్ని పంజాబ్ పోలీసులులు వెల్లడించారు. దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకోవడానికి ఒక రోజు ముందే ఫెరోజ్‌పుర్ జిల్లాలో ఈ టిఫిన్ బాంబును పోలీసులు స్వాధీనం చేశారు.

జలాలాబాద్ బాంబ్ బ్లాస్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రంజిత్ సింగ్ అలియాస్ గోరాకు పరోక్షంగా సహకరించారని ఆరోపణలపై లూధియానా పోలీసులు అదే వారంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. రంజిత్ సింగ్‌కు నివాసం, ఇతర లాజికల్ సపోర్టు ఇచ్చినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఫెరోజ్‌పుర్ వాస్తవ్యుడు జస్వంత్ సింగ్ అలియాస్ షిండా బాబా, లూధియానాకు చెందిన బల్వంత్ సింగ్‌ను అరెస్టు చేశారు.

వీరిని విచారిస్తున్నప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నిందితుల దగ్గర ఓ టిఫిన్ బాంబు ఉన్నట్టు తెలిసింది. వివరాలు ఆరా తీయగా ఆ టిఫిన్ బాంబును ఓ వ్యవసాయ క్షేత్రంలో దాచి పెట్టినట్టు తెలియవచ్చింది. ఈ విషయం తెలియగానే కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఫెరోజ్‌పుర్, లూధియానా, అలీ కే గ్రామంలోనూ గాలింపులు ముమ్మరం చేశారు. ఫెరోజ్‌పుర్ జిల్లాలోని అలీ కే గ్రామంలో ఇండియా, పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఓ వ్యవసాయక్షేత్రంలో టిఫిన్ బాంబును కనుగొన్నారు. దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని ఇంటర్నల్ సెక్యూరిటీ ఏడీజీపీ ఆర్ఎన్ ధోకే వివరించారు. త్వరలోనే మరిన్ని అరెస్టులూ జరుగుతాయని చెప్పారు. సెప్టెంబర్ 15న జలాలాబాద్ పట్టణంలో ఓ మోటార్‌సైకిల్ బ్లాస్టు జరిగింది. ఇందులో బల్విందర్ సింగ్ దుర్మరణం పాలయ్యారు. బల్విందర్ సింగ్‌కు క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది. జలాలాబాద్ బ్లాస్ట్ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఒక టిఫిన్ బాంబ్, రెండు పెన్ డ్రైవ్‌లను, నగదును వారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఇలాంటి టిఫిన్ బాంబులు రికవరీలు జరిగాయి. అమృత్‌సర్ రూరల్, కపుర్తలా, ఫజిల్కా, తర్న్ తరణ్‌లలోనూ ఇటీవలి నెలల్లోనే ఇలాంట టిఫిన్ బాంబులను పోలీసులు రికవరీ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios