Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరులో వర్షాలతో వరదలు.. ఇంటర్నెట్‌లో పోటెత్తుతున్న మీమ్‌లు.. ఫొటోలు

బెంగళూరులో వర్షాలు కురవడంతో రోడ్లు నీట మునిగిపోయాయి. కుండపోతగా వర్షం కురవడంతో వరదలు వచ్చి చేరాయి. ముఖ్యంగా ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోవాల్సి వస్తున్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, మీమ్‌లు సోషల్ మీడియాలో బెంగళూరు వాసులు షేర్ చేసుకుంటున్నారు.
 

incessant rains in bengaluru.. netizens posts videos, photos and memes
Author
First Published Aug 30, 2022, 6:43 PM IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో వర్షాలు దంచికొడుతున్నాయి. మధ్య భారతం భానుడి భగభగకు మండిపోతుంటే.. బెంగళూరు మాత్రం వరణుడి ప్రతాపానికి మునిగిపోతున్నది. వర్షాలు ఒక్కసారిగా కుండపోతగా పడుతుండటంతో రోడ్లు నీట మునిగిపోతున్నాయి. వర్ష తీవ్రత ఎక్కువ ఉండటం మూలంగా కాలేజీలు, పాఠశాలలకు హాలీడే ప్రకటించారు.

రాష్ట్రంలోని వేలాది హెక్టార్లలోని వ్యవసాయ భూమి నీటిలో మునిగిపోయింది. ముఖ్యంగా ప్రయాణికులు మాత్రం తీవ్ర అంతరాయాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. మైసూర్, బెంగళూరు హైవే పై ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోతున్నది.

ఈ సమస్యను చాలా మంది ఫన్నీగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలతో పోస్టులు పెడుతున్నారు. మీమ్‌ల వరద కొనసాగుతున్నది. కామెంట్లు పోటెత్తుతున్నాయి.

ట్రాఫిక్ పోలీసుల ప్రకారం, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ) ఏరియా, మైసూరు రోడ్డు, బన్నర్‌ఘట్టా రోడ్డు, తుమకూరు రోడ్డు, హెబ్బల్, కేఆర్ పురమ్, బెల్లందరూర్, జేపీ నగర, సిల్క్ బోర్డ్ జంక్షన్, బీటీఎం లే ఔట్, రాజాజినగర్, కోరమంగళలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఉన్నట్టు వివరించారు. ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లై ఓవర్ పైనా నీరు నిలిచిపోయినట్టు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

కొందరైతే.. ఔటర్ రింగ్ రోడ్డు.. ఔటర్ రివర్ రోడ్డు అంటూ చమత్కరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios