Lahori Gate building collapse: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య ఢిల్లీలో భవనం కూలిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో న‌లుగురు భ‌వ‌న శిథిలాల కింద చిక్కుకున్నారు. వర్షం పడుతుండగా రాత్రి 7:30 గంటలకు సంఘటన గురించి తమకు స‌మాచారం వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. 

Non-Stop Rain in Delhi: దేశ‌రాజ‌ధాని ఢిల్లీ స‌హా దాని అనుకుని ఉన్న ప్రాంతాల్లో వాన‌లు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య ఢిల్లీలో భవనం కూలిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో న‌లుగురు భ‌వ‌న శిథిలాల కింద చిక్కుకున్నారు. వర్షం పడుతుండగా రాత్రి 7:30 గంటలకు సంఘటన గురించి తమకు స‌మాచారం వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.

ఢిల్లీలోని లాహోరీ గేట్‌లో భవనం కూలిన ఘటనలో నాలుగేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందగా, నలుగురు అక్క‌డే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. పాత ఢిల్లీ ప్రాంతంలో ఉన్న భవనానికి ఐదు అగ్నిమాపక వాహనాలను పంపించారు. అలాగే, విప‌త్తు స‌హాయ‌క బృందాలు సైతం అక్క‌డ‌కు చేరుకున్నాయి. స‌హాయ‌క చర్య‌లు కొన‌సాగుతున్నాయి. కాగా, ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఫ్లైఓవర్‌ల కింద వరదలు ముంచెత్తుతున్న రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేశారు. చాలా ప్రాంతాల్లో నీటి ఎద్ద‌డి ఏర్ప‌డింద‌నీ, ప‌లు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయ‌ని అధికారులు తెలిపారు. ర‌హ‌దారుల‌పై వ‌ర‌ద నీరు నిలిచిపోవ‌డంతో రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగింది.

సోమ‌వారం నుంచి వ‌ర్షాలు ఉండ‌వు.. : ఐఎండీ

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప‌రిధిలో సోమ‌వారం నుంచి వర్షాలు ఉండవని భార‌త‌ వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 10న వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది. అయితే, దానిని అనుకుని ఉన్న ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంది. ఈ క్ర‌మంలోనే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అక్టోబర్ 10న ఉత్తరాఖండ్, తూర్పు యూపీ, సిక్కిం, మేఘాలయ, అస్సాం, పశ్చిమ మ‌ధ్య‌ప్ర‌దేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మూడు రోజులుగా వాన‌లు..

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. దేశ రాజధానిలో వారాంతమంతా ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంత‌కుముందు అంచనా వేసింది. శని, ఆదివారాల్లో ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ ప్ర‌కారం వారాంతంలో కూడా మోస్తరు వర్షాలు, సోమవారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. "అక్టోబరు 7 నుండి 11 వరకు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో వివిక్త/చెదురుమదురు భారీ వ‌ర్షాలు, ఉరుములు/మెరుపులతో వాన‌లు ప‌డ‌తాయ‌ని తెలిపింది. కాగా, ఢిల్లీలో శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. చాలా కీలకమైన మార్గాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. అయితే, 2007 నుండి జాతీయ రాజధానిలో రెండవ అత్యధిక వర్షపాతం నమోదైంది. శనివారం నుండి వర్షం కారణంగా జాతీయ రాజధానిలో ఉష్ణోగ్రత 10 పాయింట్లకు పైగా పడిపోయింది.

Scroll to load tweet…