కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన తర్వాత తీరిగ్గా ఎంజాయ్ చేస్తున్నాడు. రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఎంత కోరినా... వెనక్కి తగ్గలేదు. పార్టీ ఓటమికి తనను తాను బాధ్యుడ్ని చేసుకుంటూ.. అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాహుల్ బహిరంగ లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. 

కాగా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రాహుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలా లేఖ రాసిన మర్నాడే రాహుల్ ఓ సామాన్యుడిలా సినిమాకెళ్లిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.  

రాహుల్ చాలా కూల్‌గా ఓ సామాన్యుడిలా ఢిల్లీలోని ఓ మల్టీప్లెక్స్‌కి వెళ్లి ‘ఆర్టికల్ 15’ సినిమా చూడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రాహుల్ థియేటర్‌లో పాప్‌కార్న్ తింటూ సినిమాను ఎంజాయ్ చేసిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా సామాన్యుడిలా థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి రాహుల్ సినిమా చూడటంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.