Asianet News TeluguAsianet News Telugu

యువ‌తిపై ఉబర్‌ ఆటో డ్రైవర్ దారుణం.. ప్రైవేట్ బాడీ పార్ట్స్ తాక‌డ‌ని బాధితురాలి ఆవేదన..

ఆ మహిళ ఆటోరిక్షా చిత్రాలను కూడా పోస్ట్ చేసింది. అతను లావాదేవీ పేరు మరియు డ్రైవర్‌ను కూడా పంచుకున్నాడు. ఈ ట్వీట్‌లపై తాంబరం పోలీస్ కమిషనరేట్ స్పందిస్తూ.. కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఉబెర్ ఇండియా కూడా ఈ సంఘటనను గుర్తించింది మరియు తన రైడ్ వివరాలను పంచుకోవాలని మహిళను కోరింది.

In Viral Twitter Thread, Student Details Sex Assault By Chennai Uber Auto Driver
Author
First Published Sep 28, 2022, 12:11 AM IST

దేశంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వాలు వారి రక్షణ కోసం ఎన్ని రకాల చట్టాలు తెచ్చినా.. వారిపై  లైంగిక వేధింపులు ఆగటం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట వారిపై ఆఘాత్యాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా  చెన్నైలో లైంగిక వేధింపలు ఘటన కలకలం రేగింది. ఉబెర్ ఆటోరిక్షా డ్రైవర్ ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఉదంతం వెలుగు చూసింది. 

ఉబెర్ ఆటోరిక్షా డ్రైవర్ కాలేజీ విద్యార్థినిని వేధించాడని, ఆమె గట్టిగా అరవటంతో ఆ ఆటో డ్రైవర్ తన ఆటోను వదిలేసి పారిపోయాడని చెబుతున్నారు. గత ఆదివారం రాత్రి  ఇషితా సింగ్  అనే యువతి  తన స్నేహితురాలితో  కలిసి నగరంలోని ఓ హోటల్‌కు వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది.
 
ఈ ఘటనపై విద్యార్థిని ట్విట్టర్‌లో వివరిస్తూ.. తాను రెస్టారెంట్ నుంచి సెమంచెరిలోని హోటల్‌కు  వెళ్లడానికి ఉబర్ ఆటోరిక్షా రైడ్‌ను బుక్ చేసుకున్నట్లు తెలిపింది. హోొటల్ కు చేరుకున్న తర్వాత ఆ డ్రైవర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనీ, తన ప్రవేట్ భాగాలను తాకాడని, తన ఎద భాగాన్ని ప్రెస్ చేశాడని  ఆమె ఆరోపించింది. దీంతో తాను గట్టిగా ఆరవటంతో ఆ  డ్రైవర్ తన ఆటోను అక్కడే  వదిలి పారిపోయాడని చెప్పింది. ఈ ఘటన జరిగిన తర్వాత తాను పోలీసులకు ఫోన్ చేసినా పోలీసుల నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఆ మహిళ పేర్కొంది.

ఘటన జరిగిన 30 నిమిషాల తర్వాత.. ఓ పోలీసు మరో వ్యక్తితో కలిసి హోటల్‌కు చేరుకున్నాడని, అయితే అక్కడ మహిళా పోలీసులు లేరని బాధితురాలు తెలిపింది. స్టేషన్‌లో మహిళా అధికారి ఎవరూ లేకపోవడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు ఉదయం వరకు వేచి ఉండాల్సిందిగా కోరారు. 
 
ఈ క్రమంలో  ఆ యవతి తాను ప్రయాణించిన ఆటోరిక్షా చిత్రాలను కూడా పోస్ట్ చేసింది. ఆమె తన రైడ్ లావాదేవీ యొక్క స్క్రీన్ షాట్, డ్రైవర్ పేరును కూడా షేర్ చేసింది. ట్విట్టర్ థ్రెడ్‌పై తాంబరం పోలీస్ కమిషనరేట్ స్పందిస్తూ.. కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఉబెర్ ఇండియా ఈ సంఘటనను గుర్తించింది. తన రైడ్ వివరాలను పంచుకోవాలని మహిళను కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios