బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై  విచక్షణారహితంగా దాడి చేశారు

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు రెచ్చిపోయారు. బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై టీఎంసీ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణ సంఘటన సెప్టెంబర్ 26న చోటు చేసుకోగా... ఆలస్యంగా వెలుగు చూసింది. సెప్టెంబర్ 26న బీజేపీ 12 గంటల పాటు బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో 24 పరాగణలో రైల్‌రోకో చేస్తున్న మహిళా కార్యకర్తలపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. 

Scroll to load tweet…

నీలిమ దే సర్కార్ అనే మహిళపై టీఎంసీ నేతలు కర్రలతో చావబాదారు. ఈ ఘటన పోలీసుల కళ్లెదుటే చోటు చేసుకుంది. మళ్లీ నిమిషాల వ్యవధిలోనే మీడియా వద్ద మాట్లాడుతున్న నీలిమపై మరోసారి దాడి చేశారు టీఎంసీ నేతలు. ఈ వరుస ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.