పూలు కోసిందని అత్తను కొట్టిన కోడలు(వీడియో)

In video, Kolkata woman beats up mother-in-law for plucking flower
Highlights


పూలు కోసినందుకు అత్తను దారుణంగా కొట్టిన కోడలు

ఒకప్పుడు అత్తలు.. కోడళ్లన్ని వేధించేవారు. ఇప్పుడు కాలం మారింది.. కోడళ్లే అత్తలను హింసిస్తున్నారు. ఇందుకు నిదర్శణమే ఈ ఘటన. కోల్‌కతాలో ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తను కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

 

దీన్ని వీడియో తీసి, పోస్ట్‌ చేసిన ఓ నెటిజన్ ‘ఈ ఘటనకు గొడవకు కా‌రణం తెలియదు. కారణం తెలుసుకునే వరకూ దీన్ని షేర్‌ చేయండి’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఇది కాస్తా వైరల్‌ అయి కోల్‌కతాలోని బాన్స్ ‌ద్రోణి పోలీసులకు చేరింది. పోలీసులు రంగంలోకి దిగి గొడవకు గల అసలు కారణాన్ని కనిపెట్టారు.

దక్షిణ కోల్‌కతా ప్రాంతంలోని గరియాకు చెందిన జశోదా పాల్‌(75), తనకోడలు స్వప్నపాల్‌ అనుమతి లేకుండా వాళ్లింటి పెరట్లోని పువ్వులు కోసింది. దీంతో ఆగ్రహం చెందిన కోడలు.. వృద్ధురాలైన తన అత్తపై భౌతిక దాడికి దిగింది. విచక్షణ రహితంగా కొట్టింది. 

స్వప్న తన అత్తగారిపై దాడి చేయడం ఇదేమి తొలిసారి కాదని.. రోజూ ఇదేవిధంగా హింసిస్తోందని విచారణలో తేలింది. జశోదా పాల్‌ భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె తన కొడుకు వద్దే ఉంటోందని పోలీసులు తెలిపారు.

 అయితే జశోదాపాల్‌పై స్వప్న చేయి చేసుకుంటున్నప్పుడు ఇరుగుపొరుగు వాళ్లు చోద్యం చూశారే గానీ ఎవరూ ఆమెను ఆపడానికి రాలేదని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి దాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. కొన్నిగంటల్లోనే దాన్ని 25,000 మంది షేర్‌ చేశారు.

వృద్ధురాలని కూడా చూడకుండా ఆమెపై దాడి చేస్తున్న స్వప్నా పాల్‌ను శిక్షించాలని లేకపోతే తామే ఆ పని చేస్తామంటూ నెటిజన్లు స్పందించారు. దీంతో స్వప్నను పోలీసులు అరెస్టు చేశారు.

loader