Asianet News TeluguAsianet News Telugu

అఖిలేష్ యాదవ్, మాయావతిపై అసదుద్దీన్ సంచలన ఆరోపణలు..!

త్వరలో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో..  అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

In UP, Asaduddin Owaisi's "Foolishness" Barb At Akhilesh Yadav, Mayawati
Author
Hyderabad, First Published Sep 9, 2021, 9:25 AM IST

సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాద్ పార్టీ చీఫ్ ల కారణంగానే నరేంద్ర మోదీ.. రెండు సార్లు ప్రధాన మంత్రి అయ్యారంటూ.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, మాయావతి లపై ఓవైసీ సంచలన కామెంట్స్ చేశాడు.

అసదుద్దీన్ కారణంగా.. తమ పార్టీలకు ఓట్ స్పాయిల్ అవుతున్నాయని.. ఆయనను ఓట్ స్పాయిలర్ గా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి కామెంట్స్  కి ఓవైసీ కౌంటర్ ఇచ్చాడు.

త్వరలో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో..  అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో.. ఆయన సంచలన ఆరోపణలు చేశారు.  అఖిలేష్ యాదవ్, మాయావతి కారణంగానే... మెదీ రెండోసారి కూడా ప్రధాని అయ్యారని ఆయన పేర్కొన్నారు. కాగా.. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం వల్ల.. బీజేపీ అభ్యర్థుల ఓట్లు పాడౌతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. దానికి కూడా అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు.

తమ పార్టీ ఓట్లు చీల్చితే..గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎలా గెలిచారని ప్రశ్నించారు. "2014 మరియు 2019 లో వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింల ఓట్లతో బిజెపి గెలవలేదు, ఎందుకంటే రెండు పోల్స్‌లో కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి" అని ఓవైసీ పేర్కొన్నారు.

ముస్లింల ప్రయోజనాలను కాపాడటం కోసం తమ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తోందని, 2019 ఎన్నికల్లో హైదరాబాద్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ బీహార్‌లోని కిషన్‌గంజ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో తమ విజయాన్ని తమ పార్టీ సూచించిందని ఆయన పేర్కొన్నారు.

"మోడీ , అమిత్ షా  కాషాయ పార్టీకి మద్దతు ఇవ్వడానికి అనేక పర్యటనలు చేసినప్పటికీ మేము హైదరాబాద్‌లో బిజెపిని ఓడించాము" అని అసదుద్దీన్ పేర్కొన్నారు. 

ఇక సమాజ్‌వాదీతో పొత్తు విషయమై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మాభిమానంతో చెలగాటాలు ఆడలేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం అయోధ్యలో పర్యటించారు. ఈ సందర్భంగా  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్‌తో పొత్తు పెట్టుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘‘ఈ ప్రశ్నకు సమాధానం అఖిలేశ్‌ను అడగండి. అందరూ నన్నుఅడుగుతున్నారు. ఆత్మాభిమానంతో నేను చెలగాటాలు ఆడలేను. పొత్తు విషయంలోనే చర్చలంటూ జరిగితే పక్కాగా, ఇరు పక్షాల నుంచీ జరగాల్సిన అవసరం ఉంది.’’ అని ఒవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు. 

యూపీలో ఉన్న ముస్లింలు అత్యంత ఇబ్బందుల్లో ఉన్నారని, అధికారంలో ప్రతి ఒక్కరూ వాటాను పొందినప్పుడే పరిస్థితులు మెరుగవుతాయని అన్నారు. గతంలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని, ఇప్పుడు ముస్లింలు అసలు శక్తి ఏమిటన్నది చూపించాలని ఒవైసీ పిలుపునిచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios