Asianet News TeluguAsianet News Telugu

కరోనావేళ మరో కలకలం... విదేశీయులను మసీదులో దాచి..

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జమాతేకు చెందిన విదేశీయులను రెండు మసీదుల్లో దాచిపెట్టారు. కాగా.. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు పోలీసులు. దీంతో తాజాగా వారిని దాచిన అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మహ్మద్ షాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

In UP 30 including professor and 16 foreign Jamaatis arrested
Author
Hyderabad, First Published Apr 21, 2020, 12:17 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. చూస్తుండగానే మన దేశంలోనూ కరోనా కేసులు 18వేలు దాటిపోయాయి. తొలుత మన దేశంలో విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి కరోనా రావడం మొదలైంది. తర్వాతర్వాత వారి నుంచి ఇతరులకు అంటుకోవడం మొదలైంది.

వీటిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించారు. అయినప్పటికీ కేసులు పెరుగుతుండటంతో.. లాక్ డౌన్ పొడిగించారు. అయినా.. కేసుల సంఖ్య పెరుగూతనే ఉంది. దీంతో వీటిని ఎలా అరికట్టాలా అని ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో యూపీలో జరిగిన ఓ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జమాతేకు చెందిన విదేశీయులను రెండు మసీదుల్లో దాచిపెట్టారు. కాగా.. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు పోలీసులు. దీంతో తాజాగా వారిని దాచిన అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మహ్మద్ షాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

జమాతేకు చెందిన ఇండొనేషియా, థాయ్‌లాండ్ పౌరులను మసీదుల్లో దాచిపెట్టారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఏడుగురు ఇండొనేషియా, 9 మంది థాయ్‌లాండ్ పౌరులను అరెస్ట్ చేశారు. అంతేకాదు వీరికి సహకరించిన 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ మహ్మద్ షాహిద్‌ సహా మొత్తం 30 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

జమాతే సభ్యులను దాచి ఉంచేందుకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని మసీదుల్లో జమాతేకు చెందిన సభ్యులను దాచి ఉంచే అవకాశం ఉందనే కోణంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.  

మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జమాతే మర్కజ్ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది పాల్గొన్నారు. ఆ సదస్సులకు వెళ్లి రావడం కారణంగానే దేశంలో కరోనా కేసులు వేలల్లోకి పెరిగిపోయాయి. కాగా.. ఈ ఘటనలపై యూపీ సర్కార్ మండిపడింది. వివిధ మసీదుల్లో విదేశీయులను దాచిపెట్టారేమోనని వెతకాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios