ఈ అమ్మాయి ‘‘ఆర్ఎక్స్100’’ సినిమాలో హీరోయిన్ ని మించిపోయింది

in tamilnadu women cheated three guys at a time in the name of love
Highlights

పెళ్లి చేసుకొని అత్తవారి ఇంటిలో అడుగుపెట్టి తాళికట్టిన భర్తతో రెండు రోజులు గడిపింది.తర్వాత తాను ఒక యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులతో, కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పి పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూల దండలు వేసి అతడి వెంట మరో ఏడగులు వేసింది.

ఇటీవల విడుదలైన ఆర్ఎక్స్100 సినిమా చూశారా..? అందులో హీరోయిన్ మొదట హీరోని ప్రేమ పేరుతో వాడుకొని ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అచ్చం అలాగే.. అంతకు మించింది ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి. ఇంతకీ ఈ అమ్మాయి ఏంచేసిందో తెలుసుకుందామా..

తమిళనాడు రాష్ట్రం జయపురకి చెందిన అమ్మాయి చేసిన పని ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తోంది. ఈ ఫోటోలో అమ్మాయికి ఆమె కుటుంబసభ్యులు అదే రాష్ట్రానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. ఇటీవలే వారి పెళ్లి కూడా జరిగింది. పెళ్లి చేసుకొని అత్తవారి ఇంటిలో అడుగుపెట్టి తాళికట్టిన భర్తతో రెండు రోజులు గడిపింది.

తర్వాత తాను ఒక యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులతో, కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పి పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూల దండలు వేసి అతడి వెంట మరో ఏడగులు వేసింది. ఇతడితో కేవలం ఐదు రోజులు గడిపిన ఆమె మరో వ్యక్తితో జంప్‌ అయినట్టు కొరాపుట్‌ జిల్లాలో చర్చనీయమైంది.

దీంతో పోలీసుల సమక్షంలో ఆమె మెడలో పూల దండ వేసి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడైన రెండవ భర్త తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక యువకుని సైకిల్‌ ఎక్కి వెళ్లిపోయినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు.

అయితే ఆమె ఎక్కడకు వెళ్లింది? ఎందుకు వెళ్లింది? ఆమె మనసులో ఏముంది అనేది మాత్రం తెలియడంలేదు. దీంతో అన్ని పోలీస్‌ స్టేషన్లుకు ఆమె ఫొటోలు పంపి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.  

loader