Asianet News TeluguAsianet News Telugu

దీపోత్సవానికి ముస్తాబైన అయోధ్య.. మరోసారి గిన్నిస్ రికార్డు బద్దలుకొట్టేందుకు సన్నాహాకాలు 

దీపోత్సవ్ 2022: దీపావళి సందర్భంగా నిర్వహించే దీపోత్సవానికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య సిద్ధమవుతోంది.ఈ ఏడాది సుమారు 18 లక్షల మట్టి దీపాలను వెలిగించి మరో గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

In PM Modi's presence, Ayodhya set for new record on Deepotsav
Author
First Published Oct 23, 2022, 4:24 AM IST

దీపోత్సవ్ 2022: ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా దీపావళి సందర్భంగా నిర్వహించే దీపోత్సవానికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య సిద్ధమవుతోంది. ఈ దీపోత్సవ కార్యక్రమం దేశంతో పాటు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే..  శ్రీరాముడి పవిత్ర నగరంలో ఈ ఏడాది సుమారు 18 లక్షల మట్టి దీపాలను వెలిగించి మరో గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదివారం (అక్టోబర్ 23) దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చడం, లేజర్ షో , రాంలీలా ప్రదర్శన ఉంటాయి. ప్రధాని నరేంద్ర ఆదివారం సాయంత్రం ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ వేడుకల్లో భాగంగా సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి వద్ద గ్రాండ్ మ్యూజికల్ లేజర్ షోతో పాటు 3-డి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను కూడా నరేంద్ర మోదీ వీక్షించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ప్రదర్శనలు కూడా ఉత్సవాన్ని మరింత కన్నులపండగగా మార్చనున్నాయి.ఇది మొత్తంగా ఆరో దీపోత్సవం కానుంది. 

 దీపోత్సవ ప్రత్యేకతలు 
 
1.సరయూ నది తీరంలోని రామ్ కి పౌరి వద్ద 15 లక్షల మట్టి దీపాలను 22,000 మంది వాలంటీర్లు వెలిగిస్తారు. మిగిలినవి ముఖ్యమైన కూడళ్లు మరియు ఇతర ప్రదేశాలలో వెలిగిస్తారు. 

2. వాలంటీర్లు ఒక చతురస్రాకారంలో 256 మట్టి దీపాలను ఏర్పాటు చేస్తారని, రెండు కూడళ్ల మధ్య దూరం రెండు నుంచి మూడు అడుగుల దూరం ఉంటుందని దీపోత్సవ్ నిర్వాహకులు తెలిపారు.

3. లేజర్ షో, 3డి ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో, బాణసంచా ప్రదర్శనలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. 

4. రష్యా, ఇతర దేశాలతో పాటు, రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తారు
  
5. రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మరియు హనుమంతుడు రామ్ కథా పార్క్‌లోని పుష్పక విమానం నుండి దిగుతున్నట్లు సెట్ వేశారు.   

6. దీపావళి రోజున రామమందిరంలో పూజలు చేసేందుకు మోదీ అయోధ్యకు వెళ్లనున్నారు. శనివారం ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మోదీ రామ మందిర నిర్మాణ పనులను కూడా పరిశీలించి, ఆ తర్వాత దేవుడికి ప్రతీకగా పట్టాభిషేకం చేస్తారు.సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోదీ సరయూ నదికి హారతి ఇవ్వనున్నారు, ఆ తర్వాత ఆయన ఘనంగా దీపోత్సవ వేడుకలు ప్రారంభిస్తారు. 

కన్నుల విందుగా లేజర్ షో.. 

అయోధ్య దీపోత్సవ్‌లో ప్రధాని మోదీ సమక్షంలో గ్రాండ్‌గా లేజర్ షో నిర్వహించనున్నారు. ఈ షో నే దీపోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది, లేజర్ షోను ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల ముందు ప్రదర్శించనున్నారు. అయోధ్య దీపోత్సవ్‌ను ఘనంగా నిర్వహించేందుకు అక్టోబర్ 20 నుంచి రామ్‌కీ పైడిపై అడ్మినిస్ట్రేషన్ తరపున రెగ్యులర్ రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ రాత్రి 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 25  నిమిషాల నిడివితో 8 లేజర్ షోలు నిర్వహించనున్నారు.అదేవిధంగా.. దీపావళి రోజున(24 అక్టోబర్ 2022న) మొదటి షో సాయంత్రం 6:30 నుండే లేజర్ షోలు నిర్వహించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios