Asianet News TeluguAsianet News Telugu

పెగాసెస్ : కేంద్రం అఫిడవిట్ అందుకే దాఖలు చేయడం లేదు.. సుప్రీంకు వివరణ..

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని కోర్టుకు చెబుతూ.. "ఈ అంశంపై ప్రకటనలు అఫిడవిట్‌ల ద్వారా చేయలేం. ఇలాంటివి దాఖలు చేసి, వాటిని బహిరంగ చర్చల్లో భాగం చేయడం సాధ్యం కాదు" అని కోర్టుకు చెప్పారు.

In Pegasus Case, Why Government Won't File Affidavit In Supreme Court
Author
Hyderabad, First Published Sep 13, 2021, 1:31 PM IST

న్యూఢిల్లీ : జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా పెగాసస్ స్పైవేర్ కుంభకోణంపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయడం కుదరని, అంతే తప్ప దీంట్లో దాచడానికి ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. పెగాసెస్ స్పైవేర్ కుంభకోణంపై దాఖలైన అనేక పిటిషన్లకు ప్రతిస్పందనగా కేంద్రప్రభుత్వు ఈ మేరకు ప్రకటించింది.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని కోర్టుకు చెబుతూ.. "ఈ అంశంపై ప్రకటనలు అఫిడవిట్‌ల ద్వారా చేయలేం. ఇలాంటివి దాఖలు చేసి, వాటిని బహిరంగ చర్చల్లో భాగం చేయడం సాధ్యం కాదు" అని కోర్టుకు చెప్పారు. అంతేకాదు ‘దీనికోసం ఏ సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగిస్తున్నామో.. టెర్రరిస్టులకు తెలియజేయలేము" అని ఆయన ప్రకటించారు.

'జాతీయ భద్రత' వాదనను అర్థం చేసుకుని, ప్రశంసించినప్పటికీ... రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నాయకులు, అనిల్ అంబానీ లాంటి ప్రధాన పారిశ్రామికవేత్తలతో పాటు... కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టిన జర్నలిస్టులు,కార్యకర్తలలాంటి అనేక మంది వ్యక్తుల ఫోన్‌ల హ్యాకింగ్ ఆరోపణలకు మాత్రమే స్పందించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సుప్రీం కోర్టుకు మెహతా గుర్తు చేశారు. 

"గతంలో కూడా జాతీయ భద్రత తలెత్తింది.  దీనిని మేము ఖండించలేదు. జాతీయభద్రతకు ముప్పు కలిగే రీతిలో మేము జోక్యం చేసుకోవడం లేదు. కానీ వ్యక్తిగత ఫోన్‌లు హ్యాక్ చేయబడ్డాయని క్లెయిమ్‌లు ఉన్నాయి. అదే మేము మిమ్మల్ని అడిగాం. కాబట్టి, దానికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేశారా? "అని జస్టిస్ సూర్య కాంత్ అన్నారు.

అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు గత నెలలోనే కేంద్రానికి నోటీసు జారీ చేసింది, అంతేకాదు జాతీయ భద్రతకు ముప్పు కలిగించే సమాచారం ఏదీ ప్రభుత్వం వెల్లడించకూడదని స్పష్టం చేసింది.

"వ్యక్తుల ఫోన్‌లు హ్యాక్ అవుతున్న సమస్యలతో మాత్రమే మేం. ఆందోళన చెందుతున్నాం. ఇలా హ్యాక్ చేసే అధికారం ఏ ఏజెన్సీకి ఉంది? ఆ ఏజెన్సీ అథరైజ్డ్ దేనా కాదా? తమ వ్యక్తిగత స్వేచ్ఛకు ఇది భంగం కలిగిస్తుందని వారు ఆరోపిస్తున్నారని’ జస్టిస్ సూర్య కాంత్ సోమవారంనాడు నొక్కి చెప్పారు.

జర్నలిస్ట్ ఎన్ రామ్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అనే ఇద్దరు పిటిషనర్‌ల తరఫున హాజరయిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ‘ఇది వ్యక్తుల గోప్యతకు సంబంధించిన విషయం’ అని అన్నారు. "పెగాసస్ ఉపయోగించారా లేదా అనేది మాత్రమే మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. దేశ భద్రతకు విఘాతం కలిగించాలనుకోవడం లేదు. ఇది వ్యక్తుల గోప్యత సంబంధించిన అంశం. వ్యక్తుల మీద పెగాసస్ ఉపయోగించి, దాని లక్ష్యం  సాధారణ పౌరులే అయితే.. ఇది చాలా తీవ్రమైనది" అని ఆయన అన్నారు.

పెగాసెస్‌పై మమత సర్కార్ విచారణ కమిషన్: కేంద్రానికి , బెంగాల్ సర్కార్లకు సుప్రీం నోటీసులు

దీనికి కౌంటర్ గా మెహతా.. "వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు భంగం కలిగిందని వ్యక్తులు చెబితే.. అది తీవ్రమైనది, దాన్ని చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనికోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తాం" అని అన్నారు.

కమిటీని వేస్తాం.. అన్న కేంద్ర ప్రభుత్వ వాదన మీద కోర్టు అంత సంతృప్తికరంగా లేదు. అంతేకాదు "... అఫిడవిట్ ఉద్దేశ్యం మీరు ఎక్కడున్నారో మాకు తెలుసు. పార్లమెంట్‌లో మీ ఐటీ మంత్రి ప్రకటన ప్రకారం - ఫోన్‌ను సాంకేతిక విశ్లేషణకు గురిచేయకుండా - ఫోన్ హ్యాక్ చేయబడిందా లేదా అని అంచనా వేయడం కష్టం" అన్నారని కోర్టు చెప్పింది.

"మేము అవకాశాలు ఇచ్చాం.  అఫిడవిట్ దాఖలు చేయడానికి ప్రభుత్వం రెండుసార్లు సమయం కోరింది. ఇచ్చాం. కానీ వారికి దాఖలు చేయడం ఇష్టం లేదు" అని కోర్టు గమనించిందన్నారు. 

స్నూపింగ్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ప్రభుత్వం గతంలో పరిమిత అఫిడవిట్ దాఖలు చేసింది. 

ఆ పిటిషన్ లో పార్లమెంటులో ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ (బిజెపిలో చేరడానికి ముందు అతని ఫోన్ కూడా హ్యాక్ చేశారని తెలుపుతోంది), దీనిలో భారతీయ న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలలో "చెక్‌లు, బ్యాలెన్స్‌లు" లాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించాయి.

పెగాసస్ కుంభకోణంలో ఇజ్రాయెల్ కంపెనీ NSO గ్రూప్ భారతీయ క్లయింట్ లైన 300 మంది ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ఇతరులపై అక్రమ నిఘా చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. పొటెన్షియల్ టార్గెట్స్ జాబితాలో వారి ఫోన్ నంబర్లు ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios