Asianet News TeluguAsianet News Telugu

దారుణం : మహిళను ఎత్తుకెళ్లి.. కొట్టి, వేధించి.. కళ్లలో యాసిడ్ పోసి...!

సదరు బాధిత మహిళ పన్నా జిల్లాలోని బరౌహా గ్రామ నివాసి. తనమీద జరిగిన దాడి గురించి ఆ మహిళ మీడియాతో మాట్లాడుతూ... ఊర్లో ఓ అమ్మాయి, వేరే వ్యక్తితో పారిపోయింది. అయితే ఆమె అలా పారిపోవడానికి తను, తన తమ్ముడు సహాయం చేశారనే అనుమానంతో నిన్న గ్రామంలోని కొందరు వ్యక్తులు తమను అపహరించారని తెలిపింది. 

In Madhya Pradesh, Woman Beaten Up, Chemical Poured In Her Eyes
Author
Hyderabad, First Published Sep 23, 2021, 12:28 PM IST

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పన్నా జిల్లాలో 21 ఏళ్ల మహిళను, ఆమె సోదరుడిని కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు(Abducted). అదే గ్రామానికి చెందిన కొంతమంది ఈ దారుణానికి తెగబడ్డారు. అపహరించి ఎత్తుకెళ్లిన వాళ్లు ఆమెను, ఆమె తమ్ముడిని కిరాతకంగా కొట్టి, ఆ తరువాత ఆమె కళ్లలో యాసిడ్ లాంటి రసాయనాన్ని(Acid-like Chemical) పోశారు. దీంతో ఆమె కంటి చూపు దెబ్బతిన్నది. 

మొదట పన్నా జిల్లా ఆసుపత్రిలో చేరిన మహిళ ఇప్పుడు రీవాలోని మెడికల్ కళాశాలకు రిఫర్ చేయబడింది. వివరాల్లోకి వెడితే సదరు బాధిత మహిళ పన్నా జిల్లాలోని బరౌహా గ్రామ నివాసి. తనమీద జరిగిన దాడి గురించి ఆ మహిళ మీడియాతో మాట్లాడుతూ... ఊర్లో ఓ అమ్మాయి, వేరే వ్యక్తితో పారిపోయింది. అయితే ఆమె అలా పారిపోవడానికి తను, తన తమ్ముడు సహాయం చేశారనే అనుమానంతో నిన్న గ్రామంలోని కొందరు వ్యక్తులు తమను అపహరించారని తెలిపింది. 

తమను అక్కడినుంచి నేరుగా నిందితులు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారని, అక్కడ తమ మీద దాడి చేశారని ఆరోపించింది. అపహరించిన నిందితులు మహిళను వేధింపులకు గురి చేశారు. దీనికి ఆమె అభ్యంతరం చెప్పింది. దీంతో, ఆమె రెండు కళ్ళలో యాసిడ్ లాంటి రసాయనాన్ని పోశారు. అంతటితో ఊరుకోకుండా కళ్లను రుద్దారు.

పాత కక్షలతో వృద్ధురాలిమీద కత్తులతో దాడి, హత్య.. తలనరికి వెంటతీసుకెళ్లి... !

దీనిమీద బాధితురాలు మాట్లాడుతూ "వారు నన్ను, నా సోదరుడిని దారుణంగా కొట్టారు. తరువాత, వారిలో ఒకరు నాపై తేజాబ్ (యాసిడ్) తో దాడి చేశారు. తరువాత వారు మమ్మల్ని గ్రామంలో వదిలేసి, తప్పించుకున్నారు" అని ఆమె విలేకరులతో చెప్పింది.

పోలీస్ సూపరింటెండెంట్, పన్నా జిల్లా, ధర్మరాజ్ మీనా మాట్లాడుతూ, ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఫిర్యాదు అందిన ఐదు గంటలలోపు ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. సైబర్ సెల్ సహాయంతో నిందితులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios