Asianet News TeluguAsianet News Telugu

జమ్ము కశ్మీర్‌లో కొత్తగా 5 లక్షల ఓటర్ల చేర్పు.. లడాఖ్‌లో అంతకు మించే..!

జమ్ము కశ్మీర్‌లో కొత్తగా 5 లక్షల ఓటర్లు చేరాయి. శుక్రవారం పబ్లిష్ చేసిన కొత్త ఓటర్ల జాబితాలో జమ్ము కశ్మీర్‌లో అదనంగా 5.1 లక్షల ఓటర్లు చేరాయి. కాగా,లడాఖ్‌లో కొత్తగా 6.9 లక్షల ఓటర్లు వచ్చి చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
 

in jammu kashmir over 5 lakhs new voters in electoral list
Author
First Published Nov 26, 2022, 7:08 PM IST

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ ఓటర్ల జాబితాలో కొత్తగా 5 ఐదు లక్షల ఓటర్లు వచ్చి చేరారు. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ రిఫెరెన్స్‌తో ప్రత్యేకంగా సవరించిన జాబితాలో ఈ మేరకు కొత్త ఓటర్లు జమ్ము కశ్మీర్‌లో చేరారు. ఈ సవరించిన ఓటర్ల జాబితాను శుక్రవారం పబ్లిష్ చేశారు. గతంలో రాష్ట్రంగా ఉన్న జమ్ము కశ్మీర్‌ను జమ్ము కశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత ప్రచురించిన తొలి ఓటర్ జాబితా ఇదే.

కొత్త జాబితా ప్రకారం, ఇప్పుడు జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 83,59,774 ఓటర్లు ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ సంఖ్య 78,44,887 ఓటర్లు ఉన్నారు. అంటే ఈ ప్రత్యేక సవరింపుతో కొత్తగా జమ్ము కశ్మీర్ యూటీలో కొత్తగా 5.1 లక్షల కొత్త ఓటర్లు వచ్చి చేరినట్టు అర్థం అవుతున్నది. ఇది జమ్ము కశ్మీర్ విషయం.. అదే లడాఖ్‌లో ఈ పెరుగుదల 6.9 లక్షల ఓటర్లుగా ఉండే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. 

Also Read: జమ్ము కశ్మీర్‌లో 300 మంది టెర్రరిస్టులు యాక్టివ్‌గా ఉన్నారు: ఆర్మీ కమాండర్

జమ్ము కశ్మీర్‌లో నియోజకవర్గాల హద్దులు నిర్ణయించడానికి ముందు జమ్ము కశ్మీర్ చీఫ్ ఎన్నికల అధికారి కొత్తగా ఓటర్ల చేర్పు దాదాపు 25 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఆ తర్వాత ఆ వ్యాఖ్యను ఖండించినప్పటికీ రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున కొత్త ఓటర్లు చేరుతారని భావించారు.

జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, జమ్ము కశ్మీర్ శీతోష్ణస్థితి, ఈ శీతాకాలం దృష్ట్యా వచ్చే ఏడాది మార్చికి ముందు ఎన్నికలు నిర్వహించడం దాదాపు అసాధ్యంగానే ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios