Asianet News TeluguAsianet News Telugu

అత్యాచారం కేసు : కడుపులో బిడ్డకు తండ్రి కాదని తేలడంతో... 17 నెలల శిక్ష తర్వాత బెయిల్‌..

అత్యాచారం కేసులో శిక్షపడ్డ  నిందితుడికి 17నెలల అనంతరం బెయిల్ లభించింది. అయితే ఇది మామూలుగా బెయిల్ కాదు. అత్యాచారం వల్ల గర్భవతైన యువతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు అతను తండ్రి కాదు అని తేలడంతో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. 

In jail for 17 months, Mumbai man gets bail as DNA shows he didn't father neighbour s child - bsb
Author
Hyderabad, First Published Jan 25, 2021, 12:38 PM IST

అత్యాచారం కేసులో శిక్షపడ్డ  నిందితుడికి 17నెలల అనంతరం బెయిల్ లభించింది. అయితే ఇది మామూలుగా బెయిల్ కాదు. అత్యాచారం వల్ల గర్భవతైన యువతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు అతను తండ్రి కాదు అని తేలడంతో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. 

వివరాల్లోకి వెడితే.. ముంబైలో పొరుగింటి యువతిపై అత్యాచారం కేసులో ఓ వ్యక్తికి శిక్ష పడింది. అయితే 17 నెలల శిక్ష అనంతరం,  డీఎన్‌ఏ రిపోర్టు ఆధారంగా బాధితురాలి కడుపులో పెరుగుతున్న బిడ్డకు అతను తండ్రి కాదని తేలడంతో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన ఓ యువతి పాఠశాలలో ఉండగానే విపరీతమైన కడపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా, ఆమె గర్బవతి అని తేలింది. విషయాన్ని ఆరాతీయగా, పక్కింటి వ్యక్తే తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. దీంతో 2019 జూలై23న అతడిపై కేసు నమోదు చేశారు. కోర్టు శిక్ష కూడా విధించింది. 17నెలల పాటు జైలు జీవితాన్ని గడిపాడు. 

అయితే  ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని పేర్కొంటూ అతను రెండుసార్లు బెయిల్‌ దాఖలు చేశాడు. అయినప్పటికీ ప్రాసిక్యూషన్ ఈ అభ్యర్ధనను తీవ్రంగా వ్యతిరేకించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే, నిందితుడు సాక్ష్యాలను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. 

తాజాగా డీఎన్‌ఏ రిపోర్టు ఆధారంగా ఆ యువతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు అతడు తండ్రి కాదని తేలడంతో కోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios