Asianet News TeluguAsianet News Telugu

భారతీయ సంస్కృతిలో ఐదుగురు పురుషులు కూడా భార్యను పంచుకోవచ్చు- టీఎంసీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీకి చెందిన ఎమ్మెల్యే మదన్ మిత్రా మహిళల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాభారత ఇతిహాసాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. భారతీయ సంస్కృతిలో ఐదుగురు పురుషులు ఒక భార్యను పంచుకోవచ్చని అన్నారు. 

In Indian culture even five men can share a wife- TMC MLA's controversial comments
Author
First Published Feb 1, 2023, 2:54 PM IST

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచే తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యుడు మదన్ మిత్రా మహిళల గురించి అసభ్యకరమైన వ్యాఖ్య చేశారు. భారతీయ సంస్కృతిలో ఐదుగురు పురుషులు కూడా భార్యను పంచుకోవచ్చు (మహాభారతంలో ద్రౌపౌది, ఆమె ఐదుగురు భర్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ). అని అన్నారు. ఐదుగురు భర్తలు కూడా ఒకే భార్యను తమలో పంచుకోగలగడం భారతీయ సంస్కృతి అని తెలిపారు.

ఒడిశా ఆరోగ్య మంత్రిని ఐదు సార్లు చంపేందుకు ప్రయత్నించిన ఏఎస్ఐ.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి..

పశ్చిమ బెంగాల్‌లో మధ్యాహ్న భోజన పథకం అమలును సమీక్షించడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన కేంద్ర క్షేత్ర తనిఖీ బృందం కనుగొన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ విధంగా మాట్లాడారు. ఐదుగురికి వేతనంగా కేటాయించిన నిధుల్లో ఏడుగురు వంట సహాయకులకు సమానంగా చెల్లించడంలో అవకతవకలు జరిగాయని ఈ తనిఖీల సమయంలో వెల్లడైంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 87% మంది కోటీశ్వరులు, 43% మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్ రిపోర్ట్

అయితే మిత్రా వ్యాఖ్యలపై బీజేపీతో పాటు సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాషన్ డిజైనర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మిత్రా వ్యాఖ్యలు అధికార టీఎంసీకి మహిళలంటే గౌరవం లేదని నిరూపిస్తున్నాయని అన్నారు. అందుకే అత్యాచారం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది తృణమూల్ కాంగ్రెస్ నేతల జాబితాలో ఉన్నారని ఆమె తెలిపారు.

ఆన్‌లైన్ క్లాస్‌ చెబుతుండగానే టీచర్ దారుణ హత్య.. జూమ్ సెషన్ లో ఘటన రికార్డ్

సొంత పార్టీ నాయకులు కూడా మిత్రా వ్యాఖ్యలను విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ..  మిత్రా మాట్లాడే సమయంలో మరింత జాగ్రత్తగా పదాలను ఎంచుకోవాల్సిందని అన్నారు. ‘‘మదన్ మిత్రా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతీ వ్యక్తి ఏదైనా బహిరంగ ప్రకటన చేసేటప్పుడు పదాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గొప్ప భారత ఇతిహాసంపై అహేతుకమైన ప్రస్తావన ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు’’ అని ఘోష్ అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios