2022లో నో ఫ్లై లిస్ట్: గత ఏడాది 2022లో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 63 మంది ప్రయాణికులను 'నో ఫ్లై లిస్ట్'లో ఉంచగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు ముగ్గురు ప్రయాణికులను 'నో ఫ్లై లిస్ట్'లో ఉంచారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం రాజ్యసభలో ఈ మేరకు సమాచారం ఇచ్చింది.
దేశంలో విమానాల్లో హింసాత్మక సంఘటనలు పెరగడానికి,నియమల ఉల్లంఘనలకు గల కారణాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 63 మంది ప్రయాణికులను "నో ఫ్లై లిస్ట్"లో ఉంచినట్లు తెలిపింది. 2022లో నో ఫ్లై లిస్ట్: గత ఏడాది 2022లో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 63 మంది ప్రయాణికులను 'నో ఫ్లై లిస్ట్'లో ఉంచగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు ముగ్గురు ప్రయాణికులను 'నో ఫ్లై లిస్ట్'లో ఉంచారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం రాజ్యసభలో ఈ మేరకు సమాచారం ఇచ్చింది. మంత్రిత్వ శాఖ రాజ్యసభకు అందించిన డేటా ప్రకారం.. 2017 నుండి 2022 వరకు మొత్తం 143 మంది ప్రయాణికులను 'నో ఫ్లై లిస్ట్' జాబితాలో చేర్చినట్టు తెలిపింది. 2021లో 'నో ఫ్లై లిస్ట్'లో గరిష్టంగా 66 మందిని ఉంచారు.
'నో ఫ్లై లిస్ట్'లో ఉంచడానికి కారణం..
ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA సంబంధించిన విమానయాన సంస్థల అంతర్గత కమిటీల సిఫార్సు మేరకు అనుచితంగా ప్రవర్తించి, గందరగోళాన్ని సృష్టించిన ప్రయాణికులు ఈ జాబితాలో చేర్చబడ్డారు.సెప్టెంబర్ 2017లో CAR నోటిఫై చేయబడింది. 2017 నుంచి ఇప్పటి వరకు 143 మంది ప్రయాణికులు నో ఫ్లై లిస్ట్‌లో ఉన్నారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభలో మాట్లాడుతూ.. "ఎయిర్‌లైన్ అంతర్గత కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పటి వరకు 143 మంది ప్రయాణికులను 'నో ఫ్లై లిస్ట్'లో ఉంచారు. వారు ఉంచిన డేటా ప్రకారం.. ఎయిర్ ఇండియా 2023లో ముగ్గురు ప్రయాణికులను ఈ జాబితాలో ఉంచింది. 2022లో ఇండిగో 46 మంది ప్రయాణికులను, విస్తారా 16 మందిని మరియు స్పైస్‌జెట్ ఒకరిని 'నో ఫ్లై లిస్ట్'లో చేర్చింది.
గణాంకాల ప్రకారం.. 2021లో ఇండిగో మొత్తం 45 మంది ప్రయాణికులను, విస్తారా 19, ఎయిర్ ఏషియా ఇద్దరూ ప్రయాణికులను 'నో ఫ్లై లిస్ట్'లో చేర్చింది. మరోవైపు..2020 గురించి మాట్లాడినట్లయితే.. ఇండిగో 10 మందిని 'నో ఫ్లై లిస్ట్'లో ఉంచింది. 2017లో జెట్ ఎయిర్‌వేస్ ఒక ప్రయాణికుడిని నో-ఫ్లై జాబితాలో చేర్చింది.
గత సంవత్సరం..నో ఫ్లై జాబితాలో చేర్చబడిన రెండు కేసులు మూత్రవిసర్జనకు సంబంధించినవి కాగా.. చాలా కేసులు మాస్క్ ధరించకపోవడం లేదా సిబ్బంది సూచనలను పాటించకపోవడం వంటివి. చెడుగా ప్రవర్తించే ప్రయాణీకులతో వ్యవహరించడానికి సంబంధించిన CAR దేశీయ, అంతర్జాతీయ విమానయాన సేవలను రద్దు చేసినట్టు తెలుస్తోంది.
మూత్ర విసర్జనకు సంబంధించిన నిర్దిష్ట సంఘటనల విషయానికొస్తే, అటువంటి రెండు సందర్భాలలో వర్తించే నిబంధనలను పాటించనందుకు ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సుమారు 40 లక్షల జరిమానా విధించింది. దీంతో పాటు ఎయిర్ ఇండియా ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్‌కు ప్రత్యేకంగా రూ.3 లక్షల జరిమానా విధించారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఎయిర్ ఇండియాపై రూ.10,00,000/- (పది లక్షలు) ఆర్థిక జరిమానా విధించబడింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ సోమవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో పై సమాచారాన్ని అందించారు. అలాగే దేశంలోని 66 విమానాశ్రయాల్లో భద్రత కోసం సీఐఎస్‌ఎఫ్‌ని నియమించినట్లు ప్రభుత్వం రాజ్యసభలో తెలియజేసింది. మిగిలిన విమానాశ్రయాల్లో రాష్ట్ర పోలీసులు భద్రత కల్పిస్తారు.
