దేశరాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా చుట్టుకొస్తున్నట్టు తెలుస్తున్నది. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం, గడిచిన 15 రోజుల్లో కరోనా మహమ్మారి విస్తరణ 500 శాతం వేగం పెరిగింది. 11,743 మంది నుంచి శాంపిల్స్ తీసుకోగా, అందులో 19 శాతం మంది తమ సన్నిహిత బృందాల్లో గడిచిన 15 రోజుల్లో కరోనా సోకినవారు ఉన్నారని వివరించారు. 

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా వేగంగా వ్యాపిస్తున్నది. ఊహించని వేగంతో ఈ మహమ్మారి విస్తరిస్తున్నట్టు ఓ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా గడిచిన 15 రోజుల్లో పరిస్థితుల్లో దారుణంగా మార్పులు వచ్చినట్టు తెలిపింది. గత 15 రోజుల్లో తమకు సన్నిహిత సంబంధీకుల్లో ఎవరికో ఒకరికి కరోనా సోకిందని చెప్పినవారు 19 శాతం ఉన్నట్టు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ తన సర్వే వెల్లడించింది.

ఢిల్లీ అన్ని జిల్లాలు, ఎన్‌సీఆర్ రీజియన్‌లో నుంచి 11,743 మంది నివాసుల నుంచి సర్వే కోసం సమాచారం తీసుకున్నట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. ఈ సర్వేలో ప్రశ్నలు ఇలా ఉన్నాయి. మీకు క్లోజ్ నెట్‌వర్క్‌లో ఉండే వారిలో(కుటుంబం, స్నేహితులు, ఇరుగు పొరుగు, సహోద్యోగులు) ఎంత మందికి గడిచిన 15 రోజుల్లో కరోనా సోకింది? ఈ ప్రశ్నకు 70 శాతం మంది ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో నివాసం ఉండే తమ క్లోజో నెట్‌వర్క్‌లో వారికి గడిచిన 15 రోజుల్లో కరోనా సోకిన వారు లేరని సమాధానం ఇచ్చారు. కాగా, 11
శాతం మంది మాత్రం ఒకరు లేదా ఇద్దరికి సోకిందని, ఎనిమిది శాతం మంది ముగ్గురు నుంచి ఐదుగురికి తమకు సన్నిహిత బృందంలో కరోనా సోకిందని జవాబు ఇచ్చినట్టు లోకల్ సర్కిల్స్ తెలిపింది. కాగా, 11 శాతం మంది మాత్రం తాము సమాధానం ఇవ్వలేమని వివరించింది. మొత్తం 19 శాతం మంది గత 15 రోజుల్లో తమ క్లోజ్ కాంటాక్టుల్లో కరోనా సోకినవారు ఉన్నారి తెలిపారు.

కాగా, ఇలాంటి ప్రశ్న ఆధారంగానే ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించిన సర్వేలో కేవలం మూడు శాతం మంది మాత్రమే తమ సన్నిహితుల్లో కరోనా సోకినవారు ఉన్నట్టు తెలపడం గమనార్హం. ఢిల్లీలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో సర్వే ఫలితాలు ఇలా వెలువడటం ఆందోళనకరంగా మారింది.

ఢిల్లీలో శనివారం 461 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం టెస్టుల్లో 5.33 శాతం పాజిటివ్ కేసులు రికార్డు కావడం గమనార్హం. కాగా, రెండు మరణాలూ చోటుచేసుకున్నాయి.

కరోనా వైరస్‌ మరణాలకు (corona deaths in india) సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ (congress) ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi). దేశంలో కోవిడ్ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 40లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి రూ.4 లక్షల రూపాయల పరిహారం అందించాలని రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్‌ చేశారు. ప్రపంచ వ్యాప్త కొవిడ్‌ మరణాలను బహిర్గతం చేయాలన్న డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నాలకు భారత్‌ అడ్డుపడుతోందంటూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’లో ప్రచురితమైన కథానాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసిన రాహుల్‌ గాంధీ.. కేంద్ర వైఖరిపై మండిపడ్డారు.

ప్రధాని మోదీ (narendra modi) వాస్తవాలు మాట్లాడరని... ఇతరులను మాట్లాడనివ్వరంటూ ఆయన దుయ్యబట్టారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఏ ఒక్కరూ మరణించలేదని ఇంకా అబద్ధాలు చెబుతున్నారని రాహుల్‌ ఫైరయ్యారు. దేశంలో కొవిడ్‌ వల్ల ఐదు లక్షల మంది చనిపోలేదని.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 40 లక్షల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు గతంలోనే చెప్పానని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు రూ.4లక్షల పరిహారాన్ని అందించే బాధ్యతను నెరవేర్చాలని కేంద్రానికి రాహుల్ సూచించారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం, దేశంలో 5 లక్షల 21వేల మంది కొవిడ్‌ బాధితులు చనిపోయారు.