ఏటీఎం క్యాష్ వ్యాన్ గార్డుపై తుపాకీతో కాల్పులు జరిపి, వ్యాన్‌లోని రూ. 45 లక్షలు దోచుకుని, అక్కడి నుంచి పరారయ్యారు. 

ఏటీఎం క్యాష్ వ్యాన్ పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశాడు. అడ్డుగా ఉన్న సెక్యురిటీ గార్డుపై తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం ఆ వ్యాన్ లోని దాదాపు రూ.45లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బీహార్‌లోని సుపౌల్ జిల్లాలో గల జదియా లో బైక్ మీద వచ్చిన దుండగులు ఏటీఎం క్యాష్ వ్యాన్ గార్డుపై తుపాకీతో కాల్పులు జరిపి, వ్యాన్‌లోని రూ. 45 లక్షలు దోచుకుని, అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆ గార్డును ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఏటీఎం సిబ్బంది ఏటీఎంలో డబ్బు నింపేందుకు వాహనంలో నుంచి దిగారు. వారితో పాటు ఒక గార్డు కూడా ఉన్నాడు.

అయితే అప్పటికే అక్కడ మాటువేసివున్న దుండగులు ఏటీఎం సిబ్బంది నుంచి క్యాష్ బ్యాగ్ లాక్కొనే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో గార్డు వారిని అడ్డుకున్నాడు. దీంతో ఆ దుండగులు గార్డు తలకు తుపాకీ గురిపెట్టి కాల్పులు జరిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారి పంకజ్ కుమార్ ఇతర పోలీసు సిబ్బందితోపాటు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న సీసీటీవీలో లభ్యమైన ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.