Asianet News TeluguAsianet News Telugu

Aryan Khan Case : వాట్సప్ చాట్ ల ఆధారంగా నిందితులుగా పరిగణించలేం..

Aryan Khanతో వాట్సాప్ చాట్‌లు మినహా, ఆచిత్ కుమార్‌ అలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు తన వివరణాత్మక ఉత్తర్వుల్లో పేర్కొంది.

In Aryan Khan Case, WhatsApp Chats Not Proof Enough, Says Court
Author
Hyderabad, First Published Nov 1, 2021, 3:10 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ముంబై : డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో గత వారం ఆచిత్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ముంబై ప్రత్యేక కోర్టు పేర్కొంది. కేవలం వాట్సాప్ చాట్‌ల ఆధారంగా, సహ నిందితుడు, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు, అర్బాజ్ మర్చంట్ కు అతను డ్రగ్స్ సరఫరా చేశాడని ఆరోపించలేం అన్నారు. 

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) పంచనామా రికార్డులు కల్పితమని, అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపిన న్యాయస్థానం తన వివరణాత్మక ఉత్తర్వు, దాని కాపీని ఆదివారం అందుబాటులోకి తెచ్చింది.

నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టానికి సంబంధించిన కేసులను విచారించేందుకు నియమించబడిన ప్రత్యేక న్యాయమూర్తి వివి పాటిల్ శనివారం 22 ఏళ్ల Aachit Kumar కు బెయిల్ మంజూరు చేశారు.

Aryan Khanతో వాట్సాప్ చాట్‌లు మినహా, ఆచిత్ కుమార్‌ అలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు తన వివరణాత్మక ఉత్తర్వుల్లో పేర్కొంది.

“కేవలం వాట్సాప్ చాట్‌ల ఆధారంగా, దరఖాస్తుదారుడు (కుమార్) నిందితుడు నంబర్ 1, 2 (ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్)కి నిషిద్ధ వస్తువులు సరఫరా చేశాడని, ముఖ్యంగా నిందితుడు నంబర్ 1, వాట్సాప్ చాట్‌లు ఉన్నప్పటికీ.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది, ”అని ఉత్తర్వు పేర్కొంది.

క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అక్టోబర్ 3న అరెస్టయిన ఆర్యన్ ఖాన్, మర్చంట్‌లకు బాంబే హైకోర్టు గత గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులోని ఇతర నిందితుల్లో ఎవరితోనూ కుమార్‌ను కలిపేందుకు ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ప్రత్యేక కోర్టు పేర్కొంది.

"పంచనామా కల్పితం, అక్కడికక్కడే తయారు చేసినట్టుగా ఉంది. అందువల్ల, పంచనామా కింద చూపబడిన రికవరీ అనుమానాస్పదంగా ఉంది,దానిపై ఆధారపడలేం" అని కోర్టు పేర్కొంది.

"దరఖాస్తుదారుడు (కుమార్) నిందితుడు నంబర్ 1 (ఆర్యన్ ఖాన్)కి లేదా ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేశాడని చూపించే ఎటువంటి ఆధారాలు రికార్డులో లేవు కాబట్టి, దరఖాస్తుదారు బెయిల్‌పై విడుదల చేయడానికి అర్హులు" అని ఆర్డర్ పేర్కొంది.

కుమార్, నిందితుడు నం. ఈ కేసులో సహ నిందితులు- ఆర్యన్ ఖాన్, Arbaaz Merchant ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా Narcotics Control Bureau(ఎన్‌సిబి) అక్టోబర్ 6న అరెస్టు చేసింది.

కుమార్ నివాసం నుంచి 2.6 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీబీ పేర్కొంది. యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ ప్రకారం, కుమార్ ఆర్యన్ ఖాన్ మర్చంట్ కి గంజాయి, చరస్ సరఫరా చేసేవాడు.

కుమార్, ఆర్యన్ ఖాన్ మధ్య వాట్సాప్ చాట్‌ల రూపంలో వారు డ్రగ్స్‌ను డీల్ చేస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని NCB వాదించింది. కుమార్ తరపు న్యాయవాది అశ్విన్ థూల్ 22 ఏళ్ల యువకుడు నిర్దోషి అని, అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడు, నిరాధారమైనవని వాదించారు.

కుమార్ పెడ్లర్ అని ఎన్‌సిబి పేర్కొన్నప్పటికీ, కుమార్ పెడ్లర్‌గా వ్యవహరించిన ఒక్క సందర్భంలోనూ పేర్కొనలేదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్టోబరు 5న కుమార్‌ను అతని ఇంటి నుంచి నిర్బంధించినందున ఒకరోజు అక్రమ నిర్బంధంలో ఉంచారని, అయితే అక్టోబర్ 6న మాత్రమే అరెస్టు చేసినట్లు చూపారని కూడా పేర్కొంది.

Aryan Khan Released: జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్.. జైలుకు వద్దకు వచ్చిన షారుఖ్..భారీగా చేరుకున్న అభిమానులు

కుమార్, ఆర్యన్ ఖాన్ మధ్య ఏదైనా కుట్ర జరిగిందని చూపించడానికి రికార్డులో ఏమీ లేదని, ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు అయినప్పుడు, సమానత్వం కారణంగా, కుమార్‌ను కూడా విడుదల చేయవచ్చని కోర్టు పేర్కొంది.

ఆ సమయంలో ఓడలో లైవ్ షో నిర్వహించిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కేన్‌ప్లస్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంబంధం ఉన్న మరో నలుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ, వారు ఆర్థికంగా లేదా ఆశ్రయం కల్పించినట్లు చూపించడానికి ఎన్‌సిబి రికార్డులో ఏమీ లేదని పేర్కొంది. ఆ నలుగురు నిందితులు – సమీర్ సెహగల్, గోపాల్జీ ఆనంద్, మానవ్ సింఘాల్ మరియు భాస్కర్ అరోరా.

ఈ కేసులో అరెస్టయిన మొత్తం 20 మందిలో ఇప్పటి వరకు 14 మందికి బెయిల్ మంజూరైంది. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాకు బాంబే హైకోర్టు గత వారం బెయిల్ మంజూరు చేసింది, మిగిలిన వారికి ప్రత్యేక NDPS కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios