Asianet News TeluguAsianet News Telugu

కరోనా టీకాలమ్మా.. కరోనా టీకాలూ.. కూరగాలయమ్మినట్టే పలుకుతున్న ఆ వ్యక్తి వీడియో వైరల్

ఓ వ్యక్తి రోడ్డుపై కూరగాయలు అమ్మినట్టే టీకాలు విక్రయిస్తున్నట్టు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రోడ్డుపై నిలుచుని మందిని చూపిస్తూ వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. అంటూ కేకలు పెట్టారు. ఫస్ట్ డోసు వేసుకున్నవారు.. రెండో డోసు వేసుకోండని అరుస్తూ చెప్పాడు. 
 

in a viral video man selling vaccines in vegetable fashion
Author
New Delhi, First Published Sep 24, 2021, 2:00 PM IST

న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా జరుగుతున్నది. ఈ ఏడాది చివరికల్లా అర్హులైన వయోజనులందరికీ టీకా అందించాలని కేంద్ర ప్రభుత్వ డెడ్‌లైన్ పెట్టుకుంది. దీనికి అనుగుణంగానే వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతున్నది. తొలుత టీకాల కొరత సమస్య ఎదురైనప్పటికీ దేశీయ కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు విదేశాలకే టీకాలు ఎగుమతి చేసే స్థాయికి వెళ్లింది. కరోనాను జయించే ఏకైక మార్గంగా టీకాలు ఉన్నప్పటికీ చాలా మందిలో వాటిపై సంశయాలు ఉండటం ప్రధాన సమస్యగా ఉన్నది. అందుకే అనేక విధాలుగా అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. కరోనా వైరస్ వేసుకోవాలని పిలుపునిస్తూ, ఓ వ్యక్తి టీకాలను కూరగాయలు అమ్మినట్టే అమ్ముతున్న వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తున్నది.

 

కూరగాయలమ్మా కూరగాయలు అన్నట్టే.. వ్యాక్సిన్ లేలో వ్యాక్సిన్.. కరోనా వ్యాక్సిన్ అంటూ కేకలు వేస్తూ మంది నిలబడ్డ వారిని ఉద్దేశిస్తూ ఆయన అరుపుల వీడియో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో ఆయన వ్యాఖ్యలు స్థూలంగా ఇలా ఉన్నాయి.. ఛలో భాయ్.. వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. మొదటి డోస్ అయిపోయిందా... రెండో డోస్ వేసుకోండి.. అంటూ రోడ్డుపై కూరగాలమ్మినట్టే అన్నాడు. అందరూ టీకా వేసుకున్నారు... మీరు మాత్రమే మిగిలారు.. చలో ఇటు వైపు ఇక.. వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. ఛలో భాయ్ కరోనా వ్యాక్సిన్.. ప్రాణాలు రక్షించే వ్యాక్సిన్.. అంటూ అరిచాడు.

ఈ వీడియో ఎక్కడిదన్న వివరాలు తెలియరాలేదు. బహుశా గుజరాత్‌కు సంబంధించినది అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios