మత్తు మనిషిని ఆలోచించకుండా చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. తాగినప్పుడు విచక్షణ జ్ఞానం పని చేయదని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. ఓ పార్టీకి వెళ్లి ఫుల్లుగా తాగిన ఓ వ్యక్తి.. భోజనంతో పాటు నగలను కూడా మింగేశాడు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
ఆమెకు బంగారం షాప్ ఉంది. ఇటీవల తన ఇంట్లో ఈద్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి తన షాప్ లో పని చేసే సిబ్బందిని, బంధువులను, స్నేహితులను ఆహ్వానించింది. ఆమె ఆహ్వానంతో అందరూ ఆ పార్టీకి హాజరయ్యారు. బిర్యానితో పాటు రకరకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసింది. అందరూ చక్కగా పార్టీ ఎంజాయ్ చేశారు. భోజనాలు ముగించుకొని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. పార్టీ అయిపోయాక విలువైన బంగారపు నగలు, డెమైండ్ నెక్లెస్ పోయాయని గమనించింది. దీంతో పార్టీకి వచ్చిన వారికి కాల్ చేసింది. వారు తమకేమీ తెలియదని చెప్పారు. పార్టీకి వచ్చిన తన మేనజర్ కమ్ పార్టనర్ కు కూడా కాల్ చేసింది. ఆయన కూడా అదే విషయం చెప్పారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ మేనజర్ కడుపులోనే ఆ బంగారపు నగలు ఉన్నాయని గుర్తించి, వాటిని బయటకు తీశారు.
ఈ విచిత్ర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చైన్నై సిటీలో జరిగింది. నగల షాప్ నిర్వహించే మహిళ తన ఇంట్లో ఈద్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీ కోసం తన పార్టనర్ అలాగే షాప్ లో మేనేజర్ గా పని చేసే 32 ఏళ్ల వ్యక్తిని పార్టీకి పిలిచింది. ఆయనతో పాటు పలువురిని కూడా ఆహ్వానించింది. అందరికీ మందు, విందు ఏర్పాటు చేసింది. అయితే పార్టీ నిర్వహించే సమయంలో ఆమె పార్టనర్ తాగిన మైకంలో నగలు ఉన్న గదిలోకి వెళ్లారు. దాదాపు పది నిమిషాల పాటు అందులో ఉన్నారు. వాటిని చోరీ చేద్దామనుకున్నాడో లేక తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియక చేశాడో గానీ బిర్యానితో పాటు ఆ నగలను కూడా మింగేశాడు. తరువాత బయటకు వచ్చాడు. అందరితో పాటు బయటకు వెళ్లిపోయాడు.
షాప్ ఓనర్ బంగారం ఉన్న గదిలోకి వెళ్లి చూస్తే నగలు పోయాయని గమనించింది. ఓ డైమండ్ నెక్లెస్, ఓ పేండెంట్, మరో బంగారపు చైన్ చోరీ అయ్యిందని గుర్తించింది. తన పార్టనర్ కు కాల్ చేసి నగలు పోయాయని చెప్పింది. ఆ విషయం తనకు తెలియదని మేనేజర్ చెప్పాడు. మిగితా వారికి కాల్ చేసినా అలాంటి సమాధానమే వచ్చింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు వచ్చి విచారణ ప్రారంభించారు. తరువాత మేనేజర్ ను కూడా ప్రశ్నించారు. దీంతో తానే బంగారాన్ని మింగేశానని తీరిగ్గా చెప్పాడు. ఇది విన్న పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే హాస్పిటల్ కు వెళ్లి స్కానింగ్ తీయించారు. అతడు చెప్పిందే నిజమని తేలింది. తరువాత ఆ నగలను బయటకు తీసేందుకు వారు ప్రయత్నించారు. చివరికి మేనేజర్ తో అరటి పండు తినిపించారు. ఆ బంగారాన్ని బయటకు తీశారు. అనంతరం వాటిని ఆ షాప్ ఓనర్ కు అందజేశారు. అయితే తాను తాగిన మైకంలో ఇలా చేశానని ఆ మేనేజర్ చెప్పాడు. తాను వాటిని బిర్యానితో పాటు మింగేశానని తెలిపాడు.
