2006 వారణాసి పేలుళ్ల కేసు: వలీవుల్లా ఖాన్ కు మరణ శిక్ష
2006లో జరిగిన వారణాసి వరుస పేలుళ్ల కేసులో వలీవుల్లా ఖాన్ కు మరణశిక్ష విధించింది ఘజియాబాద్ కోర్టు.వరుస పేలుళ్ల కేసులో సుమారు 20 మంది మరణించారు.మరో 100 మంది గాయపడ్డారు.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని Varanasi లో 2006లో జరిగిన వరుస Blast కేసులో దోషిగా ఉన్న Waliullah Khan కు మరణ శిక్ష విధించింది కోర్టు. వారణాసి పేలుళ్ల కేసు ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. 2006 మార్చి 7వ తేదీన సంకట్ మోచన్ ఆలయం, కంటోన్మెంట్ రైల్వేస్టేషన్లలో జరిగిన పేలుళ్లలో కనీసం 20 మంది మరణించారు. మరో 100 మంది గాయపడ్డారు. ఘజియాబాద్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ సిన్హా వలీవుల్లాను దోషిగా నిర్ధారించారు. ఐపీసీ కింద నమోదైన రెండు కేసుల్లో హత్యా, హత్యాయత్నం పేలుడు పదార్ధాల చట్టం కింద సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఒక కేసులో వలీవుల్లాను నిర్ధోషిగా పేర్కొ్ంది కోర్టు
2006 మార్చి 6న సంకట్ మోచక్ ఆలయంలో మొదటి పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటన జరిగిన 15 నిమిషాల తర్వాత కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ లో ఫస్ట్ క్లాస్ రిటైరింగ్ రూమ్ వెలుపల పేలుడు చోటు చేసుకొంది. ఆ తర్వాత దశాశ్వమేద్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ రెయిలింగ్ వద్ద కుక్కర్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
ఈ పేలుళ్లు జరిగిన తర్వాత యూపీలోని ప్రయాగ్ రాజ్ లోని పూల్ పూర్ కు చెందిన మహ్మద్ వలీవుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. వలీవుల్లా తరపున వాదించడానికి వారణాసి న్యాయవాదులు నిరాకరించారు. ఈ పేలుళ్ల కేసులో ఘజియాబాద్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. ఈ పేలుళ్ల కేసును విచారిస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. బంగ్లాదేశ్ కి చెందిన ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జెహాద్ అల్ ఇస్లామీతో వలీవుల్లాకు సంబంధం ఉందని గుర్తించింది. ఈ పేలుళ్లకు వలీవుల్లా సూత్రధారి అని గుర్తించింది.