Asianet News TeluguAsianet News Telugu

పిల్లలు చలాకీగా ఎలా ఉంటారంటే...

పిల్లలు చలాకీగా ఎలా ఉంటారంటే...

Important nutrients for brain development of your children

ప్రతి తల్లిదండ్రులు తమ చిన్నారులు తెలివిగా, చురుగ్గా ఉండాలని కోరుకుంటారు. కానీ వాళ్లు అలా ఉండాలంటే వారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటూ, ఆరోగ్యవంతంగా ఎదుగుతుండాలి. అప్పుడే చిన్నారులు మెరుగైన జ్ఞాపకశక్తి కలిగి, నూతన ఆలోచనలతో, తెలివిగా, చురుగ్గా ఉంటారు. ఇందుకోసం  చిన్న వయసులోనే ఎక్కువగా ఎదిగే మెదడు కు ఆరు రకాల పోషకాలు ముఖ్యంగా ఉపయోగపడతాయని శాస్త్రీయంగా రుజువయ్యింది.

మీరు ఎప్పుడైనా పెద్దలను అనుకరిస్తున్న చిన్నారులను, ఎలాంటి సిగ్గు, బిడియం లేకుండా పెద్దల ఎదుట డ్యాన్స్ చేసే చిన్నారులను, కొత్తవారి ఎదుట కూడా ఆత్మవిశ్వాసంతో మాట్లాడే పిల్లలను చూశారా? పెద్దవాళ్లుగా ఇలాంటి పనులు చేయడానికి మనకు సిగ్గు, బిడియం అడ్డు వస్తుంటాయి. కానీ చిన్నారులకు ఇలాంటి అడ్డంకులు ఏవీ ఉండవు. ఇలా కొత్త విషయాలు నేర్చుకోవడంలోను, వాటిని ప్రదర్శించడంలోను చిన్నారుల మెదడు పెద్దవాళ్ల మెదడు కంటే చురుగ్గా ఉంటుందని కొన్ని అద్యయనాలు  ద్వారా శాస్త్రీయంగా రుజువయ్యింది. ఇలా చిన్న వయస్సులో మెదడు చురుగ్గా పనిచేస్తూ, యుక్త వయస్సులో వారి కంటే చురుగ్గా, ఏదైనా విషయాలను అట్టే నేర్చుకునేలా పనిచేస్తుంది.

ఇక చిన్నారుల మెదడు ఎదుగుదల, దాని పనితీరు గురించి ఓసారి  తెలుసుకుందాం. మెదడు కంటికి కనిపించని అతిసూక్ష్మ నాడీ కణాలైన న్యూరాన్లతో నిర్మితమై ఉంటాయి. ఇవి మెదడులో సుమారు పదివేల కోట్ల దాకా ఉంటాయి.  ఈ న్యూరాన్లు మెదడు లో ముఖ్య పాత్రను పోషిస్తాయి. అవయవాలకు మెదడుకు మధ్య సమాచారాన్ని చేరవేయడం ఈ న్యూరాన్ల పనే.  ఈ  న్యూరాన్ల ఎదుగులనే మెదడు ఎదుగులగా అభివర్ణిస్తుంటారు.  చిన్నారులు ఏ పని కొత్తగా నేర్చుకున్నా వీటి గొప్పతనమే. విడివిడిగా ఉండే ఇవి ఒక్కో పనికి ఒకో రకంగా బంధాన్ని ఏర్పరుచుకుంటాయి. అయితే పిల్లల్లో ఈ న్యూరాన్ల ఎదుగుదల వయసు పెరిగే కొద్ది తగ్గిపోతుంది. చిన్నారులు 6 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి న్యూరాన్ల అభివృద్ది తగ్గిపోతుంది.  కొన్ని పరిశోధనలు చెబుతున్నది ఏమిటంటే ఒక వయస్సు  వచ్చే  సరికి
మెదడు ఎదుగుదల చాలా నెమ్మదిగా జరుగుతుంది.ఇలా చిన్నారులకు 6 సంవత్సరాలు వచ్చే సరికి మెదడు 90 శాతం ఎదుగుతుందని, మిగతా జీవిత కాలంలో కేవలం 10 శాతమే ఎదుగుదల ఉంటుందని పరిశోదనల్లో తేలింది.

ఈ విషయాన్ని పరిశీలిస్తే చిన్నారులకు ఈ ఆరేళ్ల వయసు వరకు పోషకాలు ఎంత అవసరమో తెలుస్తోంది. ఈ వయసులో చిన్నారులు వేగంగా  నేర్చుకునే సామర్థ్యాన్ని, నేర్చుకున్నది ఎక్కువకాలం గుర్తుపెట్టుకోవడం, చురుగ్గా ఉండడానికి వారికి తగిన రీతిలో ముఖ్యమైన పోషకాలు అందుతుండాలి. అయితేనే వారి మెదడు చురుగ్గా పనిచేయగల్గుతుంది.   
 
మెదడు ఎదుగుదలకు ఉపయోగపడే ముఖ్యమైన పోషకాలు వాటి ఉపయోగాలు : 

1. డీహెచ్ఎ : ఇది మెదడు ఎదుగుదలకు అతి ముఖ్యమైన పోషకం. మెదడు అభివృద్ధి వేగంగా చెందాలంటే రోజువారీ తగినంత మోతాదులో ఇది అవసరం. ఇది  పిల్లలలో జ్ఞాపకశక్తిని ఓపికను మెరుగుపరుస్తుంది. దీని లోపం వల్ల పిల్లల్లో మూర్ఛ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

2. క్లోరిన్ : ఇది పిల్లోల్లో జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు ఎక్కువ కాలం జ్ఞాపకాలు గుర్తుండేలా దోహదపడుతుంది. అంటే మెదడు యొక్క మెమరీ సెంటర్ అభివృద్ధికి ఇది చాలా అవసరపడుతుంది. 

3. విటమిన్ B5 : దీనిని పాంథోథెనిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఇది మెదడు కణాల ఎదుగుదల, అభివృద్ది, మెరుగైన పనితీరుకు తోడ్పడుతుంది.

4. అయోడిన్ మరియు జింక్ : సాధారణ మెదడు అభివృద్ధి మరియు జ్ఞాపకశక్తిని  ఈ రెండు పోషకాలు చాలా ముఖ్యమైనవి. అయోడిన్  థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

5. ఐరన్ : మెదడు యొక్క సాధారణ  నిర్మాణానికి, అభివృద్ధికి మరియు కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
 


ఈ పోషకాలు మెదడు ఎదుగుదలకు ముఖ్యమైనవి అయినప్పటికీ, వాటిని తగినంత పరిమాణంలో మన రోజువారీ ఆహారంలో చేర్చి పిల్లలకు అందించడం సాద్యపడదు. ఎందువలన అంటే పిల్లలకు అవసరమైన పోషకాహారం పై తల్లిదండ్రలకు అవగాహన లేకపోవడం లేదా చిన్నారులు ఆహారం తినడానికి ఇష్టపడకుండా బెట్టుచేయడం, తక్కువ మోతాదులో తింటుండటం వంటి కారణాలతో ఈ ఫోషకాల లోపం పిల్లల్లో ఏర్పడుతుంది. కొన్ని ఫోషకాలైతే (DHA వంటివి) సాధారణంగా మనం రోజు వారిగా తీసుకునే ఆహరంలో ఉండవు. కాబట్టి చిన్నారుల ఆహారం, అలవాట్ల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ద వహించాల్సి ఉంటుంది. 

ఇందుకోసం జూనియర్ హార్లిక్స్  ప్రత్యేకంగా చిన్నారులకు పోషకాహారం తగిన పాల్లలో అందించడానికి శాస్త్రీయంగా తయారయ్యింది. ఇందులో అదిక పాళ్లలో డీహెచ్ఎ , క్లోరిన్ వంటి పోషకాలు కలిగి ఉండి చిన్నారుల మెదడు ఆరోగ్యవంతంగా ఎదుగడానికి తోడ్పడతాయి.  కేవలం మెదడు ఎదుగుదలకే కాదు పిల్లల్లో రోగ నిరోదక శక్తి పెరగడానికి, ఎముకల ఎదుగుదలకు, శరీర భాగాల ఎదుగుదలకు తోడ్పడేలా జానియర్ హార్లిక్స్ ను శాస్త్రీయ పద్దతిలొ పరిశీలించి తయారుచేశారు.  

ఇక ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు ఆహారం తీసుకోడానికి బద్దకం ప్రదర్శిస్తుంటారు. అందువల్ల వారికి తగినన్ని ఫోషకాలు అందవు. అందువల్ల చిన్నారులకు తగినన్ని పోషకాలు అందించడానికి వారిలో పోషకాహార లోపం వల్ల తలెత్తే పరిణామాలను అరికట్టడానికి జూనియర్ హార్లిక్స్ తోడ్పడుతుంది.


 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios