పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్రంలో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని సుప్రీం ఆదేశించింది. ఎలాంటి సాకులూ చూపకుండా, రాష్ట్రంలో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని సూచించింది ‘‘ఈ పథకం వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన పథకమని... మీరు సమస్యలను ఉదహరించకుండా పథకాన్ని అమలు చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కారణాల రీత్యా సీఎం మమత బెంగాల్‌లో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, మమత పట్టించుకోలేదని బీజేపీ ఆరోపిస్తోంది. 

Also Read:టీఎంసీలోకి మళ్లీ ముకుల్ రాయ్?.. బీజేపీకి భారీ షాక్..!.. కారణం అదే..