Asianet News TeluguAsianet News Telugu

Delhi-NCR : ఢిల్లీలో నేడు భారీ వర్షాలు.. ఆరంజ్ అలర్ట్ జారీ..

ఢిల్లీ ఎన్సీఆర్ లో ఆదివారం తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీవర్షం కురిసింది. శనివారం నాడు ఢిల్లీ-ఎన్సీఆర్ లో ఆదివారం తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

IMD issues orange alert for Delhi-NCR, warns of heavy rain on Saturday
Author
Hyderabad, First Published Sep 11, 2021, 9:29 AM IST

ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో శనివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీలో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

ఢిల్లీ ఎన్సీఆర్ లో ఆదివారం తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీవర్షం కురిసింది. శనివారం నాడు ఢిల్లీ-ఎన్సీఆర్ లో ఆదివారం తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

దేశ రాజధాని ఢిల్లీ నగరంతో పాటు దాని పరిసర- ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. శనివారం నాడు ఢిల్లీ-ఎన్సీఆర్ లో పలు చోట్ల ఉరములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

రోడ్లు, కాల్వలు వరదనీటి ప్రవాహంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లే అవకాశం ఉంది. ఢిల్లీలో గత 19 సంవత్సరాల్లో సెప్టెంబర్ నెలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. సెప్టెంబర్ 1న కురిసిన వర్షం ఢిల్లీలో దాదాపు రెండు దశాబ్దాల్లోనే నమోదైన అత్యధిక వర్షపాతం అని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే జెనమణి చెప్పారు. 

వర్షాకాలం ప్రారంభమైన జూన్ 1 నుంచి ఢిల్లీలో 987.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 81 శాతం ఎక్కువ అని ఐఎండీ అధికారులు వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios